బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించిన సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) రూ. 300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ సినిమా విడుదలైన 20వరోజు రూ. 65లక్షలను వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్తిక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్యా-2’ నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురవ్వడంతో వసూళ్లను రాబట్టలేకపోయింది.
‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. థియేటర్స్‌లోకి వచ్చిన నాటి నుంచే వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇండియాలో ఈ సినిమా పూర్తి రన్‌లో రూ. 75కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. 85 కోట్ల నుంచి 90కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండో సారి షాక్ తగిలినట్లయింది. గతంలో ఆయన నటించిన ‘బచ్చన్ పాండే’ పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. బ్రజ్ భాషకు చెందిన పద్యం ‘పృథ్వీరాజ్ రాసో’ ను ఆధారంగా చేసుకుని ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.