గతంలో అలాంటి యాడ్ చేయలేదన్న అక్షయ్ కుమార్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-04-22T18:07:03+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటన వివాదం గురించి తెలిసిందే. షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి అక్షయ్ చేసిన..

గతంలో అలాంటి యాడ్ చేయలేదన్న అక్షయ్ కుమార్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటన వివాదం గురించి తెలిసిందే. షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి అక్షయ్ చేసిన విమల్ ఇలాచ్చి యాడ్‌పై చాలామంది నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో దానికి సంబంధించి అక్షయ్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఇంతకుముందు ఎప్పుడు పొగాకు ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయలేదని, ఇకపై చేయని తెలిపాడు. దీంతో అక్షయ్ గతంలో చేసిన ఓ సిగరెట్ యాడ్‌కి సంబంధించిన న్యూస్‌ని వైరల్ చేస్తూ  నెటిజన్లు ఆయన్ని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.


అందులో.. ‘మీ క్లారిఫికేషన్‌లో నిజాయతీ ఉంది. కానీ అదే పూర్తి నిజాయతీగా ఉంటే బావుండేది అక్కీ సర్’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ‘గతంలో మీరు పొగాకు ప్రకటన చేయలేదని చెప్పారు. మరి సిగరెట్లో గుల్ కంద్ ఉంటుందా ఏంటి?. ఆ తర్వాత బ్యాగ్‌పైపర్. షుగర్ కలిపిన కోలా.. ఇలాంటి పొడక్ట్స్‌ని ప్రమోట్ చేసిన వ్యక్తిని సక్సెస్‌కి రోల్ మోడల్‌గా భావిస్తున్నందుకు జాలి అనిపిస్తుంది’ అంటూ ఉజ్వల్ నానావటి అనే నెటిజన్ రాసుకొచ్చాడు.





Updated Date - 2022-04-22T18:07:03+05:30 IST