Akshay Kumar సినిమాకు దారుణమైన కలెక్షన్లు.. Samrat Prithviraj కు మొదటి వారం వచ్చింది అంతేనా..?

ABN , First Publish Date - 2022-06-11T00:14:13+05:30 IST

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన సినిమా ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. ఈ చిత్రానికి చంద్ర ప్రకాష్ ద్వివేది

Akshay Kumar సినిమాకు దారుణమైన కలెక్షన్లు.. Samrat Prithviraj కు మొదటి వారం వచ్చింది అంతేనా..?

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన సినిమా ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. ఈ చిత్రానికి చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ చిత్రంలో మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మూవీని రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. మొదటి రోజు నుంచి కూడా చాలా తక్కువ వసూళ్లను రాబడుతుంది. 


ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి రోజు ఈ సినిమా రూ. 10.7కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఒక వారంలో రూ. 55కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని అంచనా. ఈ సినిమా విడుదలైన నాలుగో రోజే  ప్రేక్షకులు లేకపోవడంతో కొన్ని చోట్ల మార్నింగ్ షోస్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ చిత్రం ఏడో రోజు రూ. 2.75కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఒక్క వారంలో రూ. 55కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రలో కనిపించాడు. మహ్మమద్ ఘోరి దండయాత్రల నుంచి పృథ్వీరాజ్ భారత్‌ను ఏవిధంగా కాపాడాడనేది ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలో సంయోగితగా మనూషి చిల్లర్ కనిపించింది. సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు. హిందీ, తెలుగు, తమిళ్‌లో చిత్రాన్ని విడుదల చేశారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ తో పాటుగా ‘మేజర్’, ‘విక్రమ్’ సినిమాలు అదే రోజు విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలు గట్టి పోటీ ఇవ్వడంతో బాక్సాఫీస్ బరిలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ నిలబడలేకపోయింది.

Updated Date - 2022-06-11T00:14:13+05:30 IST