ఉత్తరప్రదేశ్‌లో Samrat Prithviraj సినిమాకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పన్ను మినహాయింపు ప్రకటించిన యోగి సర్కార్

ABN , First Publish Date - 2022-06-02T21:46:57+05:30 IST

శరవేగంగా సినిమాలు చేసే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒక్కో సినిమాను 30రోజుల నుంచి 40రోజుల్లోనే పూర్తి చేస్తుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’

ఉత్తరప్రదేశ్‌లో Samrat Prithviraj సినిమాకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పన్ను మినహాయింపు ప్రకటించిన యోగి సర్కార్

శరవేగంగా సినిమాలు చేసే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒక్కో సినిమాను 30రోజుల నుంచి 40రోజుల్లోనే పూర్తి చేస్తుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). 2017లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో అక్షయ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌(Yogi Adityanath)కు ఈ సినిమాను చూపించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం యోగి బంపర్ ఆఫర్ ఇచ్చారు.     


ఉత్తర్ ప్రదేశ్‌లో ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ ను కేబినేట్ మంత్రులతో కలసి యోగి ఆదిత్య నాథ్ వీక్షించారు. సినిమాను ఎంతగానో మెచ్చుకున్నారు. చిత్రానికి పన్ను మినహాయింపునిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్ లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కు పన్ను మినహాయింపునిస్తున్నాం. మన చరిత్ర గురించి ప్రజలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను కుటుంబ సమేతంగా తప్పకుండా చూడాలి’’ అని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. అత్యంత పరాక్రమ  ధైర్య సాహసాలు కలిగిన, ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. మహమ్మద్ ఘోరీ దండయాత్రల నుంచి పృథ్వీరాజ్ భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాడనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలోను విడుదల చేయబోతున్నారు





Updated Date - 2022-06-02T21:46:57+05:30 IST