థియేటర్లలో ఆడియన్స్ లేక Samrat Prithviraj షో లు రద్దు.. Akshay Kumar సినిమాకు నష్టాలు తప్పవా..!

ABN , First Publish Date - 2022-06-08T21:48:53+05:30 IST

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 విజేత మానుషి

థియేటర్లలో ఆడియన్స్ లేక Samrat Prithviraj షో లు రద్దు.. Akshay Kumar సినిమాకు నష్టాలు తప్పవా..!

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్‌లో  విడుదల అయింది. 


‘సామాట్ర్ పృథ్వీరాజ్’ సినిమాను రూ. 200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వారిని థియేటర్స్‌కు రప్పించలేక చతికిల పడింది. వీకెండ్ ముగియగానే సోమవారం నుంచి వసూళ్లు తగ్గడం ప్రారంభమయ్యాయి. ఆడియన్స్ లేకపోవడంతో మంగళవారం కొన్ని చోట్ల ఈ మూవీ మార్నింగ్ షోస్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పకుండా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాకు విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. కువైట్, ఒమన్, ఖతర్ దేశాల్లో ఈ చిత్రంపై నిషేధం విధించారు. ‘బచ్చన్ పాండే’ సినిమా అనంతరం అక్షయ్‌కు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఎదురైన రెండో పరాజయం ఇది.

Updated Date - 2022-06-08T21:48:53+05:30 IST