Akshay Kumar: ఇతర హీరోల 15గంటల సమయం నా 8 గంటలతో సమానం

ABN , First Publish Date - 2022-08-05T00:02:03+05:30 IST

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాను పూర్తి చేస్తుంటాడు. ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు చిత్రాలను విడుదల

Akshay Kumar: ఇతర హీరోల 15గంటల సమయం నా 8 గంటలతో సమానం

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాను పూర్తి చేస్తుంటాడు. ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు చిత్రాలను విడుదల చేస్తుంటాడు. అక్కీ తాజాగా ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) లో నటించాడు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ (Aanand L Rai) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా అక్షయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఇతర హీరోలు 15గంటలు పనిచేస్తే ఎంత ఫలితం వస్తుందో తాను 8గంటల్లో అంతే ఫలితాన్ని రాబట్టగలనని అక్షయ్ చెప్పాడు.     


అక్షయ్ కుమార్ తాజాగా నటించిన ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. అక్షయ్ ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాల్లో నటిస్తుండటంతో అతడికి సినిమాలపై నిబద్ధత(కమిట్‌మెంట్) లేదని పుకార్లు షికార్లు కొట్టడం ప్రారంభం అయ్యాయి. ఈ వదంతులపై ‘ఖిలాడీ’ హీరో స్పందించాడు. ‘‘నేను గడువులోగా సినిమాను పూర్తి చేయాలనుకుంటాను. అప్పుడు మాత్రమే ఆర్థికంగా తక్కువ భారం పడుతుంది. సినిమాలు తక్కువ వసూళ్లను రాబడుతుండటంతో అందరు ఆందోళన చెందుతున్నారు. ఆ పరిస్థితులు మారాలని నేను అనుకుంటున్నాను. ఏడాదికి నాలుగు సినిమాల్లో ఎందుకు నటిస్తావని నన్ను ప్రశ్నించేవారు. తక్కువ చిత్రాల్లో నటించమని నాకు చెప్పేవారు. సినిమాలకు వచ్చే సరికి నా స్టైల్ కొత్తగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు నేను అత్యధిక సెలవులను తీసుకుంటాను. శనివారం సగం రోజు మాత్రమే పని చేస్తాను. ఆదివారం సెలవు తీసుకుంటాను. నేను 8గంటలు మాత్రమే సినిమా సెట్‌లో గడుపుతాను. ఆ సమయంలో ఒక్క నిమిషం కూడా కార్ వ్యాన్‌లోకి వెళ్లను. ఎల్లప్పుడు మూవీ సెట్‌లోనే ఉంటాను. ఇతర హీరోలు 15గంటలు పనిచేస్తే ఎంత ఫలితం వస్తుందో తాను 8గంటల్లో అంతే ఫలితాన్ని రాబట్టగలను. సినిమాలకు సంబంధించినంత వరకు నా నిబద్ధత ఆ విధంగా ఉంటుంది’’ అని అక్షయ్ కుమార్ చెప్పాడు.  

Updated Date - 2022-08-05T00:02:03+05:30 IST