45 నుంచీ 50 రోజులు... అంతే... అంతకు మించి తన వల్ల కాదంటోన్న Akshay Kumar

ABN , First Publish Date - 2022-03-12T01:16:02+05:30 IST

ఈ సంవత్సరంలో విడుదలవుతోన్న అక్షయ్ నటించిన తొలి చిత్రం ‘బచ్చన్ పాండే’. అయితే, దీని తరువాత ‘సిండ్రెల్లా, పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామసేతు’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇన్ని సినిమాలు చకచకా తాను ఎలా చేసేయగలుగుతున్నాడో కూడా అక్కీ తాజాగా వివరించాడు...

45 నుంచీ 50 రోజులు... అంతే... అంతకు మించి తన వల్ల కాదంటోన్న Akshay Kumar

బాలీవుడ్‌లో అటు సీనియర్ హీరోల కంటే వేగంగా, ఇటు యంగ్ హీరోస్ కంటే జోరుగా సినిమాలు చేసే ఎనర్జిటిక్ స్టార్ అక్షయ్ కుమార్. సంవత్సరానికి కనీసం నాలుగైదు భారీ బడ్జెట్ చిత్రాలు ఆయన విడుదల చేస్తుంటాడు. బీ-టౌన్‌లోని ఇతర స్టార్ హీరోలు ఒక్కటి రిలీజ్ చేసేందుకే నానా అవస్థలు పడుతుంటారు. కానీ, ‘ఖిలాడీ’ స్టార్ మాత్రం లాక్‌డౌన్స్‌తో ఇబ్బంది పడ్డ గత రెండు సంవత్సరాల్లోనూ ఖాళీగా కూర్చోలేదు. ఓటీటీల్లో, థియేటర్స్‌లో రెండు చోట్లా ప్రేక్షకుల్ని అలరించాడు. 2022లో మార్చ్ 18న ‘బచ్చన్ పాండే’ సినిమాతో ఖాతా తెరవబోతున్నాడు...


ఈ సంవత్సరంలో విడుదలవుతోన్న అక్షయ్ నటించిన తొలి చిత్రం ‘బచ్చన్ పాండే’. అయితే, దీని తరువాత ‘సిండ్రెల్లా, పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామసేతు’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇన్ని సినిమాలు చకచకా తాను ఎలా  చేసేయగలుగుతున్నాడో కూడా అక్కీ తాజాగా వివరించాడు. ఏదైనా సినిమా తను సైన్ చేసే ముందు కథ, స్క్రిప్ట్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తానన్నాడు. అయితే, వాటితో పాటూ బడ్జెట్ గురించి కూడా శ్రద్ధ పెడతానన్నాడు. బడ్జెట్ మించిపోతే సినిమాకు ఖచ్చితంగా నష్టమని అక్షయ్ అంటున్నాడు.  


బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచేందుకు అక్షయ్ కుమార్ 45 నుంచీ 50 రోజులకి మించీ ఏ సినిమాకి కూడా కాల్షీట్స్ ఇవ్వడట! అంతకంటే ఎక్కువ రోజులు హీరో సెట్ మీద ఉంటే సినిమాకి అయ్యే ఖర్చు పెరిగిపోతుందని ఆయన అంటున్నాడు. తాను ఒక్కో సినిమాకి 100 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయనని తేల్చి చెప్పేశాడు. 50 రోజుల్లోపే ఒక్కో సినిమాని పూర్తి చేస్తున్నాడు కాబట్టే... ఆయన అవలీలగా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు పూర్తి చేయగలుగుతున్నాడు మరి!                                  

Updated Date - 2022-03-12T01:16:02+05:30 IST