Akshay Kumar: వరుసగా ప్లాఫ్‌లు రావడం నా తప్పే

ABN , First Publish Date - 2022-08-22T02:01:08+05:30 IST

బాలీవుడ్‌లో ఏడాదికీ మూడు నుంచి నాలుగు సినిమాలను విడుదల చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేస్తుంటాడు. అంతే వేగంతో వాటిని

Akshay Kumar: వరుసగా ప్లాఫ్‌లు రావడం నా తప్పే

బాలీవుడ్‌లో ఏడాదికీ మూడు నుంచి నాలుగు సినిమాలను విడుదల చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేస్తుంటాడు. అంతే వేగంతో వాటిని రిలీజ్ చేస్తుంటాడు. ఈ ఏడాది అక్కీ నుంచి వచ్చిన ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్ పాండే’ (Bachchhan Paandey), ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఈ లోపునే అక్షయ్ మరో సినిమా ‘కట్‌పుత్లీ’ (Cuttputlli)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘ఖిలాడీ’ హీరో తన సినిమాల పరాజయాలపై స్పందించాడు.  


‘‘సినిమాలు నడవకపోవడం అనేది నా తప్పే. నేను కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రేక్షకులకు ఏం కావాలనేది అర్థం చేసుకోవాలి. ఏ చిత్రాలు చేయాలనే విషయంలో నా ఆలోచనలను మార్చుకోవాలి. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఓటీటీలో సినిమాలను విడుదల చేసిన అవి ప్రేక్షకులకు తప్పకుండా నచ్చాలి. వారు మెచ్చుకుంటేనే మూవీ హిట్ అవుతుంది’’ అని అక్షయ్ కుమార్ వివరించాడు.‘కట్‌పుత్లీ’ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా నేరుగా ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో విడుదల కానుంది. సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌లో భారీ విజయం సాధించిన ‘రాక్షసన్’ (Ratsasan)ను ‘కట్‌పుత్లీ’ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సర్గున్ మెహతా (Sargun Mehta) కీలక పాత్రలు పోషించారు.  ఇక కెరీర్ విషయానికి వస్తే.. అక్షయ్ చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘రామ్ సేతు’, ‘ఓ మై గాడ్-2’, ‘సెల్ఫీ’, ‘జాలీ ఎల్ఎల్‌బీ-3’ వంటి సినిమాలు చేస్తున్నాడు. 


Updated Date - 2022-08-22T02:01:08+05:30 IST