Cuttputlli First Look: రక్షాబంధన్ ఫ్లాప్ తర్వాత మరో ఫస్ట్‌లుక్‌.. ఈ రీమేక్ సినిమాతో అయినా అక్షయ్‌ కుమార్‌కు హిట్టు దక్కేనా..?

ABN , First Publish Date - 2022-08-19T22:50:51+05:30 IST

బాలీవుడ్ లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30 రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తుంటాడు. చివరగా ‘రక్షాబంధన్’ లో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ

Cuttputlli First Look: రక్షాబంధన్ ఫ్లాప్ తర్వాత మరో ఫస్ట్‌లుక్‌.. ఈ రీమేక్ సినిమాతో అయినా అక్షయ్‌ కుమార్‌కు హిట్టు దక్కేనా..?

బాలీవుడ్ లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30 రోజుల నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేస్తుంటాడు. చివరగా ‘రక్షాబంధన్’ లో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ లోపునే మరో చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 


అక్షయ్ తాజాగా నటించిన చిత్రం ‘కట్‌పుతలి’ (Cuttputlli). సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అక్కీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘సిరీయల్ కిల్లర్‌ మనతో ఆడుకుంటున్నాడు. ఆ వ్యక్తిని శారీరక బలంతో గెలవలేం. బుద్ధి బలంతోనే గెలవగలం’’ అని అక్షయ్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సినిమా నేరుగా ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో విడుదల కానుంది. సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌లో భారీ విజయం సాధించిన ‘రాక్షసన్’ (Ratsasan)ను ‘కట్‌పుతలి’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ‘కట్‌పుతలి’ లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సర్గున్ మెహతా (Sargun Mehta) కీలక పాత్రలు పోషించారు.  ఇక కెరీర్ విషయానికి వస్తే.. అక్షయ్ చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘రామ్ సేతు’, ‘ఓ మై గాడ్-2’, ‘సెల్ఫీ’, ‘జాలీ ఎల్ఎల్‌బీ-3’ వంటి సినిమాలు చేస్తున్నాడు. 



Updated Date - 2022-08-19T22:50:51+05:30 IST