Akshay Kumar: అత్యధిక పన్ను చెల్లించిన బాలీవుడ్ హీరోగా అక్షయ్

ABN , First Publish Date - 2022-07-24T22:33:29+05:30 IST

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేస్తుంటాడు. ఏడాదికీ 4సినిమాల నుంచి 5 సినిమాలను విడుదల

Akshay Kumar: అత్యధిక పన్ను చెల్లించిన బాలీవుడ్ హీరోగా అక్షయ్

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేస్తుంటాడు. ఏడాదికీ 4 సినిమాల నుంచి 5 సినిమాలను విడుదల చేస్తుంటాడు. భారీగా రెమ్యూనరేషన్‌ అందుకుంటుంటాడు. బ్రాండ్‌లకు ప్రచారం చేయడం ద్వారా భారీ మొత్తంలో అర్జిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అక్కీ అత్యధిక పన్ను చెల్లించిన బాలీవుడ్ నటుడిగా నిలిచాడు. దీంతో ఆదాయపు పన్ను శాఖ అతడికీ పురస్కారాన్ని అందజేసింది.   


అక్షయ్ నటించిన ‘బచ్చన్ పాండే’ (Bachchhan Paandey), ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj) సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ అతడు అత్యధిక పన్ను చెల్లించిన బాలీవుడ్ నటుడిగా నిలవడం చెప్పుకోదగ్గ విశేషం. దీంతో ఆదాయపు పన్నుశాఖ అతడికీ ‘సమ్మాన్ పత్ర’ (Samman Patra)ను అందజేసింది. అక్కీ ఎంత పన్ను చెల్లించాడనే వివరాలు మాత్రం బయటికీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఈ ‘ఖిలాడీ’ హీరో బ్రిటన్‌లో షూటింగ్‌లో ఉన్నాడు. అందువల్ల అతడి బృందం ఈ పురస్కారాన్ని అందుకుంది. గతంలో అక్షయ్ రూ. 29.5కోట్లను పన్నుగా చెల్లించాడు. సంవత్సరాలు గడిచేకొద్ది అతడు చెల్లించే ట్యాక్స్ కూడా పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ రూ.77కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 44కోట్లు, హృతిక్ రోషన్ రూ. 25కోట్లు, షారూఖ్ ఖాన్ రూ. 22కోట్లను పన్నుగా చెల్లించారు. అక్షయ్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రామ్ సేతు, ‘సెల్ఫీ’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అతడు హీరోగా నటించిన ‘రక్షా బంధన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించాడు. భూమి ఫడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్స్‌లో విడుదల కానుంది.



Updated Date - 2022-07-24T22:33:29+05:30 IST