మన ఇండస్ట్రీకి మరో పెద్ద విజయం: ‘పుష్ప’పై అక్షయ్ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-12-22T03:59:18+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానని ఆయన తెలిపారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో

మన ఇండస్ట్రీకి మరో పెద్ద విజయం: ‘పుష్ప’పై అక్షయ్ ప్రశంసలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానని ఆయన తెలిపారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్‌తో.. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ వారు విడుదల చేశారు.


‘‘అల్లు అర్జున్.. మీరు నటించిన పుష్ప ది రైజ్ చిత్రానికి ఇండియా అంతటా వస్తున్న మాసివ్ రెస్పాన్స్‌కి అభినందనలు. మన సినిమా ఇండస్ట్రీకి ఇది మరో పెద్ద విజయం. త్వరలోనే ఈ సినిమాని చూస్తాను..’’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేయగా.. ‘‘ధన్యవాదాలు అక్షయ్ జీ. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీకు కూడా నా శుభాకాంక్షలు. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోంది..’’ అని అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చారు.





Updated Date - 2021-12-22T03:59:18+05:30 IST