Akshay Kumar: సమంతపై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్

ABN , First Publish Date - 2022-08-08T23:43:49+05:30 IST

బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ఒకరు. శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటాడు. 30రోజుల నుంచి 40రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తాడు. అక్కీ తాజాగా నటించిన చిత్రం ‘రక్షా బంధన్’

Akshay Kumar: సమంతపై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్

బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ఒకరు. 30రోజుల నుంచి 40రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేస్తాడు. అక్కీ తాజాగా నటించిన చిత్రం ‘రక్షా బంధన్’ (Raksha Bandhan). ఈ సినిమాకు ఆనంద్ ఎల్. రాయ్ (Aanand L Rai) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా అక్షయ్ హైదరాబాద్‌కు విచ్చేశాడు. ఈ సందర్భంగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ తో ముచ్చటించాడు. ‘రక్షా బంధన్’ కు సంబంధించిన ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. సమంత (Samantha) గురించి కూడా మాట్లాడాడు.       


‘రక్షా బంధన్’ లో అనేక సీన్స్ చేస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యానని అక్షయ్ చెప్పాడు. ‘‘నాకు నా సోదరి అంటే చాలా ఇష్టం. నాకంటే చిన్నదయినప్పటికి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ‘రక్షా బంధన్’ సందర్భంగా నా కుమారుడు సోదరికీ ఏ బాహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. నిన్న రాత్రే నా పిల్లలకు ఈ సినిమాను చూపించాను. ఈ చిత్రం నుంచి వారు కొత్త విషయాలను నేర్చుకున్నారు. ప్రజలకు కంటెంట్ అంటే చాలా ఇష్టం. మా మూవీ కూడా కంటెంట్‌కు సంబంధించినదే. కుటుంబం కథా చిత్రంగా ‘రక్షాబంధన్’ తెరకెక్కింది. ఈ సినిమాను అందరు తప్పకుండా చూడాలి’’ అని అక్షయ్ చెప్పాడు. సమంత గురించి కూడా మాట్లాడాడు. ‘‘సమంత అద్భుతమైన మనిషి. చాలా బాగా మాట్లాడుతుంది. సహృదయం కలది’’ అని అక్కీ తెలిపాడు. దర్శకుడైన ఆనంద్ ఎల్. రాయ్ కూడా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘‘అక్షయ్ చాలా మంచి నటుడు. అద్భుతమైన మనిషి. మంచి సోదరుడు. నేను డైరెక్షన్ ఎక్కువగా చేయాల్సిన అవసరం రాలేదు’’ అని ఆనంద్ చెప్పాడు 

Updated Date - 2022-08-08T23:43:49+05:30 IST