Akshay Kumar: క్రేజీ ప్రాంచైజీలో మరోసారి అక్షయ్

ABN , First Publish Date - 2022-08-15T01:02:25+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదల చేస్తుంటాడు. బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తుంటాడు. అక్షయ్

Akshay Kumar: క్రేజీ ప్రాంచైజీలో మరోసారి అక్షయ్

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదల చేస్తుంటాడు. బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తుంటాడు. అక్షయ్ గతంలో నటించిన మూవీ ‘జాలీ ఎల్ఎల్‌బీ-2’ (Jolly LLB 2). అర్షద్ వార్సీ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ‌(Jolly LLB)కీ సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ రెండు సినిమాలకు సుభాష్ కపూరే (Subhash Kapoor) దర్శకత్వం వహించాడు. ‘జాలీ ఎల్ఎల్‌బీ’కీ త్వరలో మూడో భాగం రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పార్ట్‌లో అక్షయ్ కీలక పాత్ర పోషించనున్నాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


‘జాలీ ఎల్ఎల్‌బీ-3’ (Jolly LLB-3) కీ కూడా సుభాష్ కపూర్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ‘‘అక్షయ్ కుమార్, సుభాష్ కపూర్, స్టార్ స్టూడియోస్ ‘జాలీ ఎల్ఎల్‌బీ’ ప్రాంచైజీపై చర్చలు జరుపుతున్నారు. ఈ సిరీస్‌లోని రెండు భాగాలతో పోల్చితే మూడో భాగం భారీగా ఉండనుంది. చిత్ర బృందం మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనుంది. నటీనటుల ఎంపిక త్వరలోనే జరగనుంది. 2023 ప్రథమార్థంలో షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చివరలో సినిమాను విడుదల చేయనున్నారు. సుభాష్ కపూర్ చెప్పిన పాయింట్ ఆసక్తికరంగా ఉంది’’ అని అక్షయ్‌తో సన్నిహితంగా మెలిగేవారు పేర్కొంటున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అక్షయ్ తాజాగా ‘రక్షాబంధన్’ ను రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికీ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించాడు. ‘రామ్ సేతు’, ‘సెల్ఫీ’, ‘బడే మియా చోటే మియా’, ‘సిండ్రెల్లా’ వంటి ప్రాజెక్టులు కూడా అతడి చేతిలో ఉన్నాయి. 

Updated Date - 2022-08-15T01:02:25+05:30 IST