Video Viral: ఓ ప్రాణాన్ని కాపాడిన బాలీవుడ్ హీరో.. ఆశ, సంకల్పం ఉండాలంటూ..

ABN , First Publish Date - 2022-04-10T19:42:35+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. అందుకే.. ఆయన సినిమా కోసం ఎప్పుడెప్పుడా..

Video Viral: ఓ ప్రాణాన్ని కాపాడిన బాలీవుడ్ హీరో.. ఆశ, సంకల్పం ఉండాలంటూ..

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. అందుకే.. ఆయన సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఈ నటుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా.. ఈ స్టార్ ప్రజలకు సేవ చేయడంలో ముందుంటుంటారు. అది తన చేతల్లో, మాటల్లో కూడా చూపిస్తుంటారు. అక్షయ్ తాజాగా ఓ తూనీగ ప్రాణాన్ని కాపాడాడు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో అక్షయ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా.. ఓ తూనీగ అందులో పడింది. ఇది గమనించిన ఈ నటుడు దాన్ని బయటికి తీసి దాన్ని రక్షించాడు. అంతేకాకుండా ఆ వీడియోకి.. ‘ఈ చిన్న స్నేహితుడు ఈ ఉదయం స్విమ్మింగ్ పూల్‌లో జారిపడ్డాడు. అతనికి సహాయం అవసరమైంది. అనంతరం కొంచెం ఓపిక, కొంచెం ఉత్సాహం... అంటూ ఎగిరి గంతేశాడు. మనందరికీ జీవితంలో ఇది అవసరం. హృదయంలో ఆశ, జీవించాలనే సంకల్పం, ఎగరడానికి రెక్కలు ఖచ్చితంగా ఉండాలి’ అంటూ ఇన్‌స్పిరేషనల్‌గా రాసుకొచ్చాడు.


ఈ పోస్ట్ చూసిన ఎంతోమంది అభిమానులు అక్షయ్ కుమార్‌పై ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వాటిని ఆయన షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కుదిరినప్పుడల్లా సొసైటీకి ఉపయోగపడేలా ఏదో విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా.. తన సినిమాల్లో సైతం ఎన్నో సోషల్ ఇష్యూలను చూపిస్తుంటాడు.



Updated Date - 2022-04-10T19:42:35+05:30 IST