Akshay Kumar vs Aamir Khan.. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ ఫైట్.. ఒకే రోజు ఇద్దరి సినిమాలు విడుదలకు రెడీ..!

ABN , First Publish Date - 2022-06-17T19:42:07+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న హీరోల్లో అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. వీరిద్దరిలో అక్షయ్ వరుసగా..

Akshay Kumar vs Aamir Khan.. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ ఫైట్.. ఒకే రోజు ఇద్దరి సినిమాలు విడుదలకు రెడీ..!

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న హీరోల్లో అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. వీరిద్దరిలో అక్షయ్ వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు, మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటాడు. ఆమీర్ మాత్రం అక్షయ్‌కి విరుద్ధంగా చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంటాడు. కాగా.. ఈ స్టార్స్ ఇద్దరి సినిమాలు త్వరలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.


చాలా గ్యాప్ తర్వాత ఆమీర్ ఖాన్ నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్ధా’. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటించింది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా.. ఇటీవలే ఈ మూవీని ఆగస్టు 11 విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకంటించిన విషయం తెలిసిందే. కాగా.. అక్షయ్ కుమార్ కొత్త సినిమా ‘రక్షా బంధన్’ని సైతం అదే రోజు అంటే ఆగస్టు 11నే విడుదల చేయనున్నట్లు ఆ చిత్రబృందం తాజాగా ప్రకటించింది.


అత్రంగి రే మూవీ తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించడం, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటాడని అక్షయ్‌కి పేరుడడం వల్ల.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఆమీర్ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాలు రెండు ఒకేసారి రావడం వల్ల ఫలితం ఉంటుందని వారి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంకా సమయంలో ఉండడం వల్ల వారిలో ఎవరైనా వెనక్కి తగ్గుతారెమోనని చూస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదలైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద టఫ్‌ ఫైట్‌గా జరిగే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట చర్చించుకుంటున్నారు.



Updated Date - 2022-06-17T19:42:07+05:30 IST