Akshay Kumar Birthday Special: రేఖ నుంచి ప్రియాంకచోప్రా వరకూ.. ఖిలాడీ కుమార్ ప్రేమాయణాలు నడిపింది వీరితోనే..

ABN , First Publish Date - 2022-09-09T18:34:21+05:30 IST

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో ఓ టర్నింగ్ పాయింట్ వస్తుంది. కానీ.. దాన్ని అందిపుచ్చుకుని జీవితంలో సక్సెస్ అయ్యేవారు..

Akshay Kumar Birthday Special: రేఖ నుంచి ప్రియాంకచోప్రా వరకూ.. ఖిలాడీ కుమార్ ప్రేమాయణాలు నడిపింది వీరితోనే..

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో ఓ టర్నింగ్ పాయింట్ వస్తుంది. కానీ.. దాన్ని అందిపుచ్చుకుని జీవితంలో సక్సెస్ అయ్యేవారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి చాలా కొద్దిమందిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఒకరు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన అక్షయ్.. చిన్న వయస్సులో పలు దేశాలు తిరిగి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. అనంతరం ముంబైకి వచ్చి అక్కడే ఓ స్కూల్‌లో ట్రైనర్‌గా చేరాడు. అక్కడి ఓ విద్యార్థి సలహా మేరకు మోడల్‌గా మారి.. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స్టార్ హీరో హోదాని అనుభవిస్తున్నాడు. ఈ రోజు (సెప్టెంబర్ 9)న పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ 56 పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ తరుణంలో ఆయన జీవితం గురించి ప్రత్యేక కథనం..


అక్షయ్ కుమార్ సెప్టెంబరు 9, 1967న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించాడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరిఓం భాటియా. ఆయన 1987లో మహేష్ భట్ చిత్రం ‘ఆజ్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1991 సంవత్సరంలో వచ్చిన ‘సౌగంధ్’ చిత్రంతో ఆయన జీవితమే మారిపోయింది. దాదాపు 35 ఏళ్ల కెరీర్‌లో 125 పైగా నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆయనకంటూ పత్యేక పేజీని సంపాదించుకున్నాడు. అయితే.. కెరీర్ ప్రారంభంలో అక్షయ్ దాదాపు ఎనిమిది సినిమాల టైటిల్స్‌లో ఖిలాడీ అని ఉండడంతో ఆయనని అభిమానులు ‘ఖిలాడీ కుమార్’గా పిలుచుకుంటూ ఉంటారు. కాగా.. అక్షయ్ వ్యక్తిగత విషయాలు చాలా తక్కువమందికే తెలుసు. ముఖ్యంగా ఆయన లవ్ ఎఫైర్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రేఖ నుంచి ప్రియాంక చోప్రా వరకూ చాలామందితో ఆయన డేటింగ్ చేశారు.


1) పూజా బాత్రా 

అక్షయ్ కుమార్ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే మొదట వచ్చే పేరు పూజా బాత్రా. అక్షయ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తల్లో అప్పటికే మోడల్‌గా మంచి పేరు ఉన్న పూజా బాత్రాతో పరిచయం ఏర్పడింది. అనంతరం వారి మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారింది. అయితే.. ప్రేమ విషయంలో పూజా చాలా సీరియస్‌గా ఉండగా.. అక్షయ్‌కి అది టైమ్ పాస్ మాత్రమేనని అప్పట్లో టాక్ నడిచింది. దాంతో కెరీర్‌లో ఎదుగుతున్న తరుణంలో ఆమెకి బ్రేకప్ చేప్పేశాడు.


2) ఆయేషా జుల్కా

తొంభయ్యేవ దశకంలో బాగా ఫేమ్ ఉన్న నటి అయేషా జుల్కా. ఖిలాడీ సినిమాలో అక్షయ్ ఆమెతో కలిసి నటించాడు. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో అక్షయ్‌తో ఆయేషా ప్రేమలో పడింది. అయితే అక్షయ్ కెరీర్‌కి అదే ప్రారంభ దశ కావడంతో ఎవరితోనూ సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉండాలనుకోలేదు. అందుకే ఆ నటికి బ్రేకప్ చేప్పేశాడు.


3) రవీనా టాండన్

అక్షయ్ ఎక్కువ కాలం డేటింగ్ చేసిన నటి రవీనా టండన్. వీరిద్దరూ పలు సినిమాలకు కలిసి పనిచేశారు. ముఖ్యంగా వీరిద్దరు కలిసి నటించిన ‘టిప్ టిప్ బర్సా పానీ’ సాంగ్ అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది. అందుకే చాలాకాలం వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరూ పంజాబీలే కావడంతో ఓ సందర్భంలో వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ.. అదే సమయంలో మరో ముగ్గురు అమ్మాయిలతో అక్షయ్ డేటింగ్ చేయడం వల్ల వారి బంధం తెగిపోయిందని టాక్ వచ్చింది.


5) రేఖ

అక్షయ్‌తో రేఖ కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. అయితే ఈ రిలేషన్ షిప్ గురించి ఇద్దరూ మీడియా ముందు ఎప్పుడూ చెప్పలేదు.


6) ట్వింకిల్ ఖన్నా

ముంబైలో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ సందర్భంగా అక్షయ్, ట్వింకిల్ ఖన్నా కలుసుకున్నారు. అనంతరం వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులకే పెళ్లి బంధంతో ఒకటయ్యారు.


7) ప్రియాంక చోప్రా

ట్వింకిల్‌తో పెళ్లి తర్వాత అక్షయ్ ప్రియాంక చోప్రాతో ప్రేమ వ్యవహారం నడిపాడని టాక్.  అందాజ్ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ ప్రియాంకతో ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కూడా పలు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే.. ఈ విషయం తెలిసిన ట్వింకిల్ గొడవ పెట్టుకోవడంతో అప్పటి నుంచి అక్షయ్ ప్రియాంకతో కలిసి నటించలేదని తెలుస్తోంది.


4) శిల్పాశెట్టి

బాలీవుడ్‌లోని అత్యంత అందమైన నటీమణులలో శిల్పాశెట్టి ఒకరు. ఈమెతోనూ అక్షయ్ ఎఫైర్ నడిపాడు. ఓ సందర్భంలో ఈ నటులు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ.. పలు కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.

Updated Date - 2022-09-09T18:34:21+05:30 IST