Akshara Singh MMS leak: అశ్లీల వీడియోపై బిగ్‌బాస్ బ్యూటీ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-09-19T21:45:21+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. టెలివిజన్ వేదికగా ప్రసారమైన ఈ షో మంచి..

Akshara Singh MMS leak: అశ్లీల వీడియోపై బిగ్‌బాస్ బ్యూటీ రియాక్షన్ ఇదే..

బాలీవుడ్‌లోని టాప్ రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. టెలివిజన్ వేదికగా ప్రసారమైన ఈ షో మంచి సక్సెస్ అవడంతో అనంతరం బిగ్‌బాస్ ఓటీటీ(Bigg Boss OTT)ని కూడా ప్రారంభించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఆ షోతో పాపులారిటీ సాధించిన భోజ్‌పురి నటి అక్షర సింగ్ (Akshara Singh). ఆ పాపులారిటీతో బాలీవుడ్‌లోనూ పలు అవకాశాలను అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి న్యూస్‌లోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఓ అశ్లీల వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఆ వైరల్ వీడియో(Viral Video)ని చూసిన పలువురు నెటిజన్లు అందులో ఉంది అక్షర సింగ్ అంటూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టారు.


ఈ వైరల్ వీడియోపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అందులో అక్షయ మాట్లాడుతూ.. ‘ఆ వీడియోలో ఉంది నేను కాదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి పని ఎవరు చేసినా నేను అస్సలు పట్టించుకోను అని చెప్పింది. అందుకే ఆ వీడియోని ఇంతవరకూ చూడలేదు. ఇలాంటి పిచ్చి పనులు నన్ను ఏ మాత్రం బాధించలేవు’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. ఇలా నటుల వీడియోలంటూ విడుదల కావడం ఇదే మొదటి సారి కాదు. గత కొన్ని వారాల క్రితం కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాకప్(LockUp)’ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అంజలి అరోరా (Anjali Arora) అనే నటి వీడియో కూడా ఇలాగే లీక్ అయ్యింది. అంతేకాకుండా.. గతంలో కూడా ఇలాగే పలువురు సినీ తారల పేరుతో పలు అశ్లీల వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. అయితే.. తరువాత ఆ తారలే మీడియా ముందుకు వచ్చి ఆ వీడియోలకి తమకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Updated Date - 2022-09-19T21:45:21+05:30 IST