Akkineni Nagarjuna: వైఎస్ఆర్‌సీపీలోకి నాగార్జున.. విషయమేమిటంటే?

ABN , First Publish Date - 2022-09-07T23:30:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా..

Akkineni Nagarjuna: వైఎస్ఆర్‌సీపీలోకి నాగార్జున.. విషయమేమిటంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా.. నాగార్జున వెళ్లి కలిశారు. ఈ మధ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల విషయంలో టికెట్ రేట్లపై జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు కూడా.. నా సినిమాకు ఆ ధరలతో ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటూ నాగ్ అనుకూలంగానే మాట్లాడాడు. ఇంకా పలు సంఘటనలు జగన్-నాగార్జున మంచి స్నేహితులనే విషయాన్ని తెలియజేశాయి. అలాంటి నాగార్జున పేరు ఇప్పుడు వైసీపీ విషయంలో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందుకూ అంటే.., నాగార్జున విజయవాడ నుండి వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) తరపున లోక్ సభకు పోటీ చేయవచ్చనే ఊహాగానాలతో వచ్చిన వార్తతో ఆయన పేరు సోషల్ మాధ్యమాలలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే విషయమై నాగార్జున సన్నిహితులని సంప్రదించగా, ఆయనెందుకు రాజకీయాలలోకి వస్తారు, రారు.. ఇవన్నీ ఎవరో కావాలని కల్పించిన వార్తలుగా కొట్టేపారేశారు. నాగార్జున మరియు జగన్ మంచి స్నేహితులు మాత్రమే, అంతే కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ పరమైన సంబంధాలు లేవు. ఒకవేళ ఉండి ఉంటే.. గత ఎన్నికలలో జగన్ తరపున నాగార్జున ప్రచారం చేసే వారు కదా.. అని అంటున్నారు. అయితే వారు ఓ విషయం మాత్రం చెప్పారు. 


అదేంటంటే.. నాగార్జున అన్నయ్య వెంకట్ అక్కినేని (Venkat Akkineni) విద్యా సంస్థలను చూసుకుంటున్నాడనీ.., ఆయనని అడిగితే ఏమైనా పోటీ చేసే అవకాశం ఉండవచ్చని అని చెప్పారు. ఆయన విషయంలో కూడా కష్టమే కానీ.. వెంకట్‌ రాజకీయాలలోకి వచ్చే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పారు. అక్కినేని కుటుంబం మొదటి నుండీ రాజకీయాలకు దూరంగానే వున్నారు కానీ.. ఆ కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) దగ్గర నుండి ఇప్పటి నాగార్జున వరకు ముఖ్యమంత్రులతో, రాజకీయ నాయకులతో మాత్రం సన్నిహితంగా ఉండేవారు.. ఉంటున్నారు. అంతే కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు, ఏ పార్టీ‌కి సపోర్ట్ ఇవ్వలేదు. అందుకని నాగార్జున పోటీ చేయడమనేది కేవలం గాసిప్ మాత్రమే.

Updated Date - 2022-09-07T23:30:30+05:30 IST