Akhil Akkineni : అమ్మ బర్త్ డేకి ఎలా విషెస్ తెలిపాడో తెలుసా?

ABN , First Publish Date - 2022-09-13T18:15:53+05:30 IST

అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ (Akhil).. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligible Bachelor) చిత్రంతో తొలి హిట్టు అందుకున్నాడు. తాజాగా ‘ఏజెంట్’ (Agent) చిత్రంలో నటిస్తున్నాడు. ‘

Akhil Akkineni : అమ్మ బర్త్ డేకి ఎలా విషెస్ తెలిపాడో తెలుసా?

అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ (Akhil).. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligible Bachelor) చిత్రంతో తొలి హిట్టు అందుకున్నాడు. తాజాగా ‘ఏజెంట్’ (Agent) చిత్రంలో నటిస్తున్నాడు. ‘సిసింద్రీ’ (Sisindri) మూవీతో పాకేవయసులోనే తెరమీదకొచ్చిన అఖిల్‌ తనకు తండ్రి నాగార్జున (Nagarjuna) దగ్గర కన్నా తల్లి అమల (Amala) దగ్గరే గారం ఎక్కువని తరచుగా చెబుతూ ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తన తల్లిపట్ల తనకున్న ప్రేమాభిమానాల్ని చాటుకుంటూ ఉంటాడు. 


ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా జరిగిన అమ్మచేతి వంట అనే చిట్ చాట్ లో అమల గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాల్ని పంచుకున్నాడు అఖిల్. చెన్నైకి వెళితే తనను నాగార్జున కొడుకు అనరని, అమల కొడుకంటారని, ఆమె గురించే ఎక్కువగా అడుగుతారని చెప్పాడు అఖిల్. అమ్మకి అక్కడ విపరీతమైన క్రేజుందని.. ఇంకా తనకి, తండ్రికీ ఫైటింగ్ వస్తే  అమ్మ అడ్డుపడుతుందని తెలిపాడు. 


తల్లిపై అంత ప్రేమున్న  అఖిల్ .. ఆమె పుట్టినరోజు సందర్బంగా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘హ్యాపీ బర్త్ డే టు మై సన్‌షైన్.. నిన్ను చేస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. నిన్ను ప్రేమిస్తునే ఉంటానమ్మా’ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఈసందర్భంగా తండ్రితో, తల్లితో తను దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-09-13T18:15:53+05:30 IST