అఖిల్ ‘ఏజంట్’ విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-03-11T23:21:50+05:30 IST

అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ

అఖిల్ ‘ఏజంట్’ విడుదల తేదీ ఖరారు

అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్ర్య దినోత్సవం విడుదలకు అనువైన సమయంగా మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చినట్లవుతుంది.


తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఈ సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో తెలియజేస్తోంది. అఖిల్ ఇప్పటి వరకు కనిపించిన దానికి భిన్నంగా యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో ఈ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు మమ్ముట్టి కూడా పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ కథ అందించారు.



Updated Date - 2022-03-11T23:21:50+05:30 IST