మనవడి కోసం... సెలబ్రిటీ గెస్టులు, విదేశీ నలభీములు, ప్రైవేట్ జెట్స్, 100 మంది పురోహితుల ఆశీర్వాదాలు!

ABN , First Publish Date - 2021-12-17T20:21:51+05:30 IST

డిసెంబర్ 10వ తేదీన అంబానీల వారసుడు పృథ్వీ మొదటి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆకాశ్, శ్లోకా అంబానీల తనయుడు, ముఖేశ్, నీతా అంబానీల మనవడు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఎప్పటిలాగే అంబానీ ఫ్యామిలీ భారీ ఎత్తున పార్టీ ప్లాన్ చేసింది.

మనవడి కోసం... సెలబ్రిటీ గెస్టులు, విదేశీ నలభీములు, ప్రైవేట్ జెట్స్, 100 మంది పురోహితుల ఆశీర్వాదాలు!

డిసెంబర్ 10వ తేదీన అంబానీల వారసుడు పృథ్వీ మొదటి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆకాశ్, శ్లోకా అంబానీల తనయుడు, ముఖేశ్, నీతా అంబానీల మనవడు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఎప్పటిలాగే అంబానీ ఫ్యామిలీ భారీ ఎత్తున పార్టీ ప్లాన్ చేసింది. 


ఇంకా కరోనా గండం పూర్తిగా ముగిసిపోకపోవటంతో అంబానీ బర్త్ డే బాష్‌ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతిథులకి ముందుగానే కొన్ని సూచనలు పంపించారు. వాటి సారాంశం ఏంటంటే... అందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునే రావాలి. జరగబోయేది ‘‘పుల్లీ క్వారంటైన్డ్ బబుల్ పార్టీ’’ అంటూ ప్రత్యేకంగా పేర్కొనటం జరిగిందట!


డిసెంబర్ 10న జరిగే బర్త్ పార్టీ కోసం డిసెంబర్ 7 నుంచే ప్రతీ రోజూ కోవిడ్ 19 టెస్ట్‌లు చేయించుకోవాల్సిందిగా కూడా అతిథులకి సూచించారని సమాచారం. ఇక పృథ్వీ అంబానీ ఫస్ట్ బర్త్ డే అంబానీల జామ్‌నగర్ బంగళాలో జరగటంతో అక్కడికి అతిథులందర్నీ ప్రైవెట్ జెట్‌లో తరలించారు. 


పార్టీకి వచ్చే వీఐపీ, సెలబ్రిటీ గెస్టులు 120 మంది మాత్రమే అయినప్పటికీ జూనియర్ మోస్ట్ అంబానీ బర్త్ డే సంరద్భంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జామ్‌నగర్‌కు దగ్గర్లోని గ్రామాల్లో 50 వేల మందికి భోజనాలు పెట్టారని బాలీవుడ్ టాక్. అలాగే, జామ్‌నగర్ చుట్టుపక్కల ఉన్న 150 అనాథశరణాలయాల్లో కూడా అంబానీల వారసుడి పుట్టినరోజు వేడుకలు జరిగాయి!


రాజకీయ, సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కొత్త అంబానీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు జామ్‌నగర్‌లో ల్యాండ్ అయ్యారు. రణబీర్, ఆలియా, రణవీర్, సచిన్, జహీర్ ఖాన్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ వంటి వారు లిస్టులో ఉన్నారు. 


ఇక సెలబ్రేషన్స్ విషయానికి వస్తే టాప్ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ అతిథుల సమక్షంలో ఆలపించాడట. ఇటలీ, థాయిలాండ్ నుంచీ ప్రత్యేకంగా చెఫ్స్‌ని జామ్‌నగర్ తీసుకొచ్చారు. కొద్ది రోజుల ముందుగానే ముంబైలో దిగిన వారంతా తగిన విధంగా క్వారంటైన్‌లో ఉంటూ, రెగ్యులర్ కరోనా టెస్టులు చేయించుకుంటూ గడిపారని సమాచారం. పార్టీలో ఏ విధంగానూ వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖేశ్, నీతా అంబానీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. 


పృథ్వీ అంబానీ తొలి జన్మదినం కావటంతో ఆశీర్వచనాలు పలికేందుకు వంద మంది పురోహితుల్ని కూడా వేడుక వద్దకి సాదారంగా ఆహ్వానించారు. ఇక సంబరానికి తరలి వచ్చిన అతిథుల పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం కూడా రూపొందించారు. చిన్నారులంతా అక్కడ ఆడుకోవటానికి వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. పార్టీ పూర్తయ్యాక గెస్టులందర్నీ మళ్లీ ప్రైవేట్ జెట్స్‌లో జామ్‌నగర్ నుంచీ వివిధ ప్రాంతాలకు పంపిస్తూ అంబానీ ఫ్యామిలీ వీడ్కోలు పలికింది!


అంబానీల ఇంట జరిగిన బర్త్ డే బాష్ కొస మెరుపు ఏంటంటే... అతిథులు ఎవ్వర్నీ బహుమతులు తీసుకురావద్దని సూచించటం. తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలకు ఆ డబ్బుని వినియోగించాలని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ చెప్పారట. ఇంతకీ, పెద్దల హడావిడి సరే... సంవత్సరం వయస్సున్న బుజ్జి అంబానీ సంగతేంటి అంటారా? తనకి ఈ ఆర్భాటం అంతా అర్థం అయ్యే ఛాన్సే లేదు కాబట్టి, పృథ్వీ అంబానీ వాళ్ల మమ్మీ శ్లోక హాలాండ్ నుంచీ ఆట బొమ్మలు తెప్పించిందట!

Updated Date - 2021-12-17T20:21:51+05:30 IST