Ajith Kumar: అల్ట్రా మోడ్రన్ బైక్‌పై మరోసారి..

ABN , First Publish Date - 2022-06-21T17:04:41+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మీగతా హీరోల మాదిరిగా కమర్షియల్ సినిమాలను కాకుండా కాస్త

Ajith Kumar: అల్ట్రా మోడ్రన్ బైక్‌పై మరోసారి..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మీగతా హీరోల మాదిరిగా కమర్షియల్ సినిమాలను కాకుండా కాస్త విభిన్నమైన కథాంశాలతో వచ్చి హిట్స్ అందుకుంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయం దొరికితే మాత్రం బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతారు. అజిత్‌కు ఇలా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ఖరీదైన బైక్‌లను కొనడం..వాటిపై వందల కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళడం  ఓ ఫ్యాషన్. అంతేకాదు, ఆయన వద్ద దాదాపు 20 బైకుల వరకూ ఉన్నాయట.


అజిత్ నడిపిన ఈ BMW బైక్ దూర ప్రయాణాలలో గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని బైక్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఇక, ఆయన సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం హెచ్ వినోద్ (H.Vinod) డైరెక్షన్‌లో తన 61వ సినిమా చేయబోతున్నారు. బాలీవుడ్ మేకర్ బోనీకపూర్‌ (BoneyKapoor)తో కలిసి అజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసి పెట్టుకున్నారు. త్వరలో వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయని సమాచారం. 


ఇప్పటికే ఆయన ఇండియాలో పలు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాడు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు కూడా చాలాసార్లు బైక్‌పైనే వెళ్ళారు. ఇక అజిత్ నటించిన గత చిత్రం వలిమై (Valimai)లోనూ ఆయన తన సొంత బైకులనే ఉపయోగించారు. గత సెప్టెంబర్‌లో బైక్‌పై విదేశాలను చుట్టొచ్చిన ఆయన, తాజాగా మరోసారి అల్ట్రా మోడ్రన్‌గా ఉన్న సరికొత్త బైక్‌పై యూరప్‌లోని పలు ప్రదేశాలను చుట్టేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-06-21T17:04:41+05:30 IST