Nayan బాయ్‌ఫ్రెండ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన Ajith...

ABN , First Publish Date - 2022-03-21T01:09:32+05:30 IST

సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఫ్యాన్స్ ముందుకొచ్చింది ‘వలిమై’. అజిత్ అభిమానులు అద్భుతం అన్నప్పటికీ మిక్డ్స్ రివ్యూస్ రావటంతో ఊహించినంత బాక్సాఫీస్ సందడైతే జరగలేదు. అయితే, ప్రస్తుతం అజిత్ తరువాతి చిత్రాల గురించి కూడా కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది...

Nayan బాయ్‌ఫ్రెండ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన Ajith...

సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఫ్యాన్స్ ముందుకొచ్చింది ‘వలిమై’. అజిత్ అభిమానులు అద్భుతం అన్నప్పటికీ మిక్డ్స్ రివ్యూస్ రావటంతో ఊహించినంత బాక్సాఫీస్ సందడైతే జరగలేదు. అయితే, ప్రస్తుతం అజిత్ తరువాతి చిత్రాల గురించి కూడా కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోసారి బోనీ కపూర్ నిర్మాణంలో, డైరెక్టర్ వినోద్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే బోనీ, వినోద్, అజిత్ కాంబినేషన్‌లో ‘నెర్కొండ పార్వై, వలిమై’ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి ముగ్గురూ కలుస్తారని చెన్నైలో ముచ్చట వినిపిస్తోంది. అయితే, అంతకంటే ఇంట్రస్టింగ్ అప్ డేట్ మరొకటి కూడా ప్రచారం అవుతోంది... 


నయనతార బాయ్‌ఫ్రెండ్‌గా తెలుగు వారికి బాగా పరిచయమున్న విఘ్నేశ్ శివన్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపునే సాధించుకున్నాడు. ఆయన చేసిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ వచ్చాయి. అయితే, విఘ్నేశ్ నెక్ట్స్ మూవీ తల అజిత్‌తోనే అంటున్నారు తమిళ సినీ జనం. ప్రస్తుతానికి ‘ఏకే 62’గా వ్యవహరిస్తోన్న ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కించనుందట. అజిత్, విఘ్నేశ్ కాంబినేషన్‌లో సినిమా 2022 చివర్లో సెట్స్ మీదకు వెళుతుందని అంటున్నారు. 2023 మధ్యలో విడుదల అవుతుందట. మిగతా వివరాలన్నీ త్వరలోనే తెలిసే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి, ‘విశ్వాసం’ సినిమాలో నయనతారతో కలసి నటించిన అజిత్ ఆమె ప్రియుడు విఘ్నేశ్ రూపొందించే సినిమాలో ఎవరితో రొమాన్స్ చేస్తాడో! 

Updated Date - 2022-03-21T01:09:32+05:30 IST