Ajay Gadu: బిగ్‌బాస్‌ ఫేమ్‌కి సత్యదేవ్ సపోర్ట్

ABN , First Publish Date - 2022-09-09T05:56:18+05:30 IST

విడుదలైన ఫస్ట్ లుక్‌లో అజయ్ కతుర్వార్ కండలు తిరిగిన దేహంతో కనిపించి ఆకట్టుకున్నారు. న్యూస్ పేపర్ రెండు చేతులతో పట్టుకుని ఉండగా.. మధ్యలో ఆ పేపర్ కాలిపోతుండగా..

Ajay Gadu: బిగ్‌బాస్‌ ఫేమ్‌కి సత్యదేవ్ సపోర్ట్

బిగ్‌బాస్ మలయాళం సీజన్ 4 ఫేమ్ అజయ్ కతుర్వార్ (Ajay Kathurvar) హీరోగా నటిస్తూ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా చేసిన చిత్రం ‘అజయ్ గాడు’ (Ajay Gadu). ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, టైటిల్‌ను టాలెంటెడ్ హీరో సత్య దేవ్ (Satya Dev) తాజాగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫైర్ టీజ‌ర్‌ను కూడా మేకర్స్ విడుద‌ల చేస్తామని ప్రకటించారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అజయ్ కతుర్వార్ కండలు తిరిగిన దేహంతో కనిపించి ఆకట్టుకున్నారు. న్యూస్ పేపర్ రెండు చేతులతో పట్టుకుని ఉండగా.. మధ్యలో ఆ పేపర్ కాలిపోతుండగా.. ఆయన లుక్ రివీల్ అయినట్లుగా ఈ ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Ajay Gadu First Look)


‘విశ్వక్’ చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన అజయ్ కతుర్వార్.. ‘రాగల 24 గంటల్లో, అలాంటి సిత్రాలు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలలో నటించారు. ఇప్పుడాయనే ఓ ప్రొడక్షన్ హౌస్ నిర్మించి.. చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అజయ్ సరసన భానుశ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అలాగే అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీ బాధ్యతను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.

Updated Date - 2022-09-09T05:56:18+05:30 IST