Thor 4లో Ajay Devgn పాత సినిమా స్టంట్.. హాలీవుడ్ హీరోపై బాలీవుడ్ హీరో సెటైర్లు

ABN , First Publish Date - 2022-07-07T19:49:07+05:30 IST

బాలీవుడ్‌లో భారీ అభిమానగణం ఉన్న స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఒకరు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని..

Thor 4లో Ajay Devgn పాత సినిమా స్టంట్.. హాలీవుడ్ హీరోపై బాలీవుడ్ హీరో సెటైర్లు

బాలీవుడ్‌లో భారీ అభిమానగణం ఉన్న స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఒకరు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని స్టంట్స్, యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అజయ్ కెరీర్ ప్రారంభంలో ‘ఫూల్ ఔర్ కాంటే’ అనే సినిమా చేశాడు. అందులో.. ఆయన ఇంట్రాడక్షన్‌ సీన్‌లో రెండు బైకులపై రెండు కాళ్లు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడు. ఎంతో రిస్క్‌తో కూడిన ఆ సీన్‌కి అప్పట్లో యువత ఫిదా అయిపోయారు. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో ఓ సీన్‌లో హీరో పాత్రధారి ఈ అజయ్ ఫేమస్ స్టంట్‌ని ఇమిటేట్ చేశాడు. దానిపై బాలీవుడ్ హీరో స్పందిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడు.


హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూవీ సిరీస్ ‘అవెంజర్స్’. ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 28 సినిమాలు, 7 వెబ్‌సిరీస్‌లు విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో చిత్రం ‘థోర్: లవ్ అండఠ్ థండర్ (Thor Love And Thunder)’ విడుదలైంది. ప్రత్యేకంగా ‘థోర్’ సిరీస్‌‌లో ఇది నాలుగవ సినిమా. ఆ మూవీ సైతం మంచి టాక్‌తో దూసుకుపోతోంది.  ఈ మూవీలో క్రిస్ హేమ్స్‌వర్త్ (Chris Hemsworth) హీరోగా నటించాడు. అయితే.. ఈ మూవీ ట్రైలర్‌లో కొన్నినెలల క్రితం విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఆ ట్రైలర్‌లోని ఓ సీన్‌లో అజయ్ ఫేమస్ స్టంట్‌ని కాపీ కొట్టారు. దానిపై అజయ్ దేవ్‌గణ్ సెటైరికల్‌గా ఓ ట్వీట్ చేశాడు. అందులో.. రెండు టీ గ్లాసులపై పెట్టిన పెద్ద సమోసా పిక్‌ని షేర్ చేశాడు. దానికి.. ‘ఇంటి వద్ద ప్రయత్నించాడనికి ఈ స్టంట్ చాలా సురక్షితం’ అని వెటకారంగా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.


అజయ్‌ మాత్రమే కాకుండా పలువురు ఆయన అభిమానులు సైతం ఇంతకుముందే థోర్ మూవీలోని ఈ సీన్‌పై ట్వీట్స్ చేశారు. అందులో.. ‘థోర్, అజయ్ దేవ్‌గణ్ అభిమానిగా మారిపోయినట్టున్నాడు’ అని ఓ నెటిజన్.. ‘అజయ్‌ని థోర్ కాపీ కొట్టాడు’ అని మరొకరు రాసుకొచ్చారు. అలాగే.. మరొకరు అజయ్ పాత సినిమాలో సుత్తి పట్టుకున్న పిక్, థోర్ సుత్తి పట్టుకున్న పిక్‌ని షేర్ చేశాడు. దానికి సైతం ‘క్రిస్ హేమ్స్‌వర్త్ ఖచ్చితంగా అజయ్ దేవ్‌గణ్ ఫ్యాన్ అయ్యింటాడ’ని రాసుకొచ్చాడు.











Updated Date - 2022-07-07T19:49:07+05:30 IST