స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో వహించిన సినిమా ‘ఖైదీ’ (Kaithi). కార్తి హీరోగా నటించాడు. తమిళ్‌తో పాటు తెలుగులో 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌లో ఈ సినిమాను ‘భోలా’ (Bholaa) టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటిస్తున్నాడు. టబు హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.
తాజాగా ‘భోలా’ కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. అజయ్ కెమెరా పట్టుకున్న ఫొటోను జులై 4న సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మరో సారి యాక్షన్ చెప్పడానికి సిద్ధం. ‘భోలా’ 2023, మార్చి 30న విడుదల కానుంది’’ అని అజయ్ దేవగణ్ తెలిపాడు. ‘భోలా’ కు అజయ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు మెగాఫోన్ పట్టుకోవడం నాలుగోసారి. గతంలో ‘యు’, ‘మి ఔర్ హమ్’, ‘రన్ వే-34’ సినిమాలకు అజయ్ డైరెక్షన్ చేశాడు. అజయ్ దేవగణ్ దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితమే ‘రన్ వే-34’ (Runway 34) వచ్చింది. ఏప్రిల్ 29న విడుదలైంది. ఏవియేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. అభిమానులను మెప్పించలేకపోయినప్పటికి, విమర్శకుల ప్రశంసలు మాత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.