Aishwarya Rajesh: బాలీవుడ్‌లోకి ఐశ్వర్య రాజేష్.. ఈ సారైనా కలిసొచ్చేనా?

ABN , First Publish Date - 2022-11-08T16:39:44+05:30 IST

కోలీవుడ్‌ (Kollywood)లో పాటు టాలీవుడ్‌ (Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh)...

Aishwarya Rajesh: బాలీవుడ్‌లోకి ఐశ్వర్య రాజేష్.. ఈ సారైనా కలిసొచ్చేనా?

కోలీవుడ్‌ (Kollywood)లో పాటు టాలీవుడ్‌ (Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh). తమిళంలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ ‘కౌసల్య కృష్ణమూర్తి’, మరి కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. సినీ పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుందని నిరూపించిన అతి కొద్దిమంది తారల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు.


సౌత్‌లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ కెరీర్‌‌లో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్‌ త్వరలో బాలీవుడ్‌ (Bollywood)లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాణిక్‌’ (Manik). ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. 2017లో ‘డాడీ’ చిత్రం ద్వారా ఐశ్వర్య హిందీలో అడుగుపెట్టి ఆ తర్వాత తమిళ, తెలుగు భాషలకే పరిమితమైంది.


కాగా ఎండేమోల్‌ షైన్‌ ఇండియా, నట్మెగ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిస్తున్న ‘మాణిక్‌’లో ఐశ్వర్యతో పాటు సంయుక్త షణ్ముగనాథన్‌, వివేక్‌ ప్రసన్న, సాయ్‌ జనని, స్వర కాంబ్లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రానికి సామ్రాట్‌ చక్రవర్తి దర్శకుడు. వచ్చే యేడాది విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐశ్వర్య చేతిలో ‘డ్రైవర్‌ జమున’, ‘స్వప్న సుందరి’, ‘ఫర్హానా’ వంటి చిత్రాలు  ఉండగా.. అందులో ‘డ్రైవర్‌ జమున’ త్వరలో విడుదలకానుంది.





Updated Date - 2022-11-08T16:39:44+05:30 IST