‘Driver Jamuna’గా ఐశ్వర్య రాజేష్.. ఫస్ట్ లుక్ ఇదే!

ABN , First Publish Date - 2022-05-06T03:04:35+05:30 IST

వైవిధ్యమైన సినిమాలను ఎన్నుకుంటూ.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఆమె ప్రధాన పాత్రలో ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీగా..

‘Driver Jamuna’గా ఐశ్వర్య రాజేష్.. ఫస్ట్ లుక్ ఇదే!

వైవిధ్యమైన సినిమాలను ఎన్నుకుంటూ.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఆమె ప్రధాన పాత్రలో ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రైవర్ జమున’ (Driver Jamuna). పా. కిన్స్లిన్ (Pa. Kinslin) దర్శకత్వంలో 18 రీల్స్‪పై ఎస్.పి.చౌదరి (S.P. Choudhary) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‪ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‪లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్‪గా ఐశ్వర్య రాజేష్ కనిపించారు.  


లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్ డ్రైవర్లని కలసి వారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేచురల్‪గా ఈ పాత్రకు సిద్ధమైనట్లుగా ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మాములుగా అయితే రోడ్ మూవీస్‪ని బ్లూ మ్యాట్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. ఐతే ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్‪ను ఎటువంటి డూప్ లేకుండా నటించినట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా రూపొందించినట్లుగా వారు ప్రకటించారు. కాగా, షూటింగ్ చివరిదశలో వున్న ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. జిబ్రాన్ (Ghibran) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-05-06T03:04:35+05:30 IST