Ponniyin Selvan I: రజనీకాంత్‌కు ఐశ్వర్యారాయ్ పాదాభివందనం.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-09-07T15:59:31+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఐశ్వర్యారాయ్ ఒకరు. మామూలుగా ఏ నటికైనా పెళ్లైతే..

Ponniyin Selvan I: రజనీకాంత్‌కు ఐశ్వర్యారాయ్ పాదాభివందనం.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఐశ్వర్యారాయ్ ఒకరు. మామూలుగా ఏ నటికైనా పెళ్లైతే వాళ్లకి అప్పటి వరకూ ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ సాధారణంగా తగ్గుతుంటుంది. కానీ.. ఐశ్వర్యకి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఓ దక్షిణాది సినిమా చేస్తోంది. అది కూడా ఆమె గురువైన మణిరత్నం దర్శకత్వంలోనే నటిస్తోంది. ఆ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ I(Ponniyin Selvan I)’. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా మూవీ టీం చెన్నైలో విడుదల చేసింది.


ఆ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు మేకర్స్. దానికి రజనీకాంత్ (Rajinikanth), కమల్‌హాసన్‌తోపాటు కోలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ఐశ్వర్య కూడా హాజరైంది. ఈ సందర్భంగా జరిగిన సంఘటనకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో.. రజనీకాంత్‌ని చూసిన ఐశ్వర్య ఆయన కాళ్లకి మొక్కింది. వెంటనే నటిని లేపిన రజనీ ఆమెని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అంతేకాకుండా.. ఇద్దరూ ఒకరికి ఒకరు రెండు చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తూ ఐశ్వర్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీరు నిజంగా క్వీన్’, ‘కర్ణాటకకి చెందిన ఐశ్వర్యారాయ్ తన సంస్కృతిని మర్చిపోలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




అలాగే మరో వైరల్ వీడియోలో సైతం.. ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నంని చూసిన ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈ వీడియోపై కూడా పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఆమె గురువుగా భావించే దర్శకుడికి ఇచ్చే మర్యాద గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2022-09-07T15:59:31+05:30 IST