వైరల్ అవుతున్న అందాల తార Aishwarya Rai వీడియో.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ..

ABN , First Publish Date - 2022-07-21T18:10:03+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో ఐశ్వర్యారాయ్ ఒకరు. ఈ భామ అందానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు..

వైరల్ అవుతున్న అందాల తార Aishwarya Rai వీడియో.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) ఒకరు. ఈ భామ అందానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నటి 2007లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ (Abhishek Bachchan)ని పెళ్లి చేసుకోగా.. 2011లో ఈ జంటకి ఆరాధ్య (Aaradhya) అనే కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆరాధ్య వయస్సు పది సంవత్సరాలు దాటింది. తాజగా ఐశ్వరారాయ్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.


తాజాగా అభిషేక్, ఐశ్వర్య జంట కూతురు ఆరాధ్యతో కలిసి న్యూయార్క్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఈ జంట ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. అందులో.. ఐశ్వర, కూతురి చేయిపట్టుకొని నడుస్తూ వస్తోంది. అభిషేక్ వారి వెనకాలే ఉన్నాడు. ఆ సమయంలో ఐశ్వర్య లూజ్‌గా ఉన్న బ్లాక్ డ్రెస్ వేసుకుంది. అంతేకాకుండా.. ఆమె పొట్టకి చెయ్యి అడ్డుపెట్టుకుంది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలకు ఊతం దొరికనట్లైంది. పలువురు నెటిజన్లు అదే విషయాన్ని తెలుపుతూ కామెంట్స్ సైతం చేస్తున్నారు.


అయితే.. మణిరత్నం దర్శకత్వంలో ‘గురు’ అనే సినిమాలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఈ జంట మధ్య ప్రేమ పుట్టింది. అనంతరం 2007 ఏప్రిల్‌ 20న ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి చేసుకోగా.. 2011 నవంబర్‌ 16న ఈ కపుల్‌కి ఆరాధ్య జన్మించింది. పెళ్లి తర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాల‌ను చేసింది ఐశ్వర్య. కానీ.. ఎక్కువ స‌మ‌యం కుటుంబానికే కేటాయించేందుకు మొగ్గు చూపింది. ఐశ్వర్య ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’లో నటిస్తోంది.



Updated Date - 2022-07-21T18:10:03+05:30 IST