ప్రేమ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు: Aishwaryaa Rajinikanth

ABN , First Publish Date - 2022-02-18T01:03:02+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య

ప్రేమ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు: Aishwaryaa Rajinikanth

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. పెళ్లి అయిన 18ఏళ్ల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా వెల్లడించారు. అనంతరం ధనుష్, ఐశ్వర్య తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి రజినీకాంత్, లత రజినీకాంత్, కస్తూరి రాజా, సెల్వరాఘవన్ తదితరులెందరో ప్రయత్నించారని తెలుస్తోంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. 


ప్రస్తుతం ఐశర్య రెండోసారి ప్రేమను వెతుకుతున్నట్టు తెలిపింది. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయని పేర్కొంది. వాటిని తప్పకుండా ఎదుర్కొవాలని చెప్పింది. మనకు ఏదయితే రావాలో అది తప్పకుండా వస్తుందని వెల్లడించింది. ‘‘ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ. వ్యక్తిగత అంశాలతో దానికి సంబంధం లేదు. నేను ఎదిగే కొద్ది నాతో పాటు ప్రేమ నిర్వచనం మారుతోంది. నా పిల్లలతో సహా మా అమ్మ, నాన్నలను నేను ప్రేమిస్తాను. ప్రేమ అనేది  ఏ ఒక్క వ్యక్తికి పరిమితం కాకూడదని నేనకుంటున్నాను’’ అని ఐశ్వర్య ధనుష్ చెప్పింది. విడాకుల ప్రకటన తర్వాత సైలెంట్‌గా ఉన్న ధనుష్.. చాలా రోజుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన కొడుకు యాత్రాతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో యాత్రా, రజినీ స్టైల్‌లో గాల్లోకి జుట్టును లేపాడు. ‘‘గతంలో ఈ స్టైల్‌ని ఎక్కడో చూశాను’’ అని ధనుష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.




Updated Date - 2022-02-18T01:03:02+05:30 IST