మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబందించిన న్యూస్ ఒకటి గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. దీనిపై తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయిందని సమాచారం. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, దర్శక - నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని..అందుకే షూటింగ్ దశలో ఏజెంట్ ఆగిపోయిందని ప్రచారం అవుతోంది. అంతేకాదు, ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ అవడం కూడా కష్టమని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు నిర్మాతకు చేరడంతో తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఏజెంట్ సినిమాకు సంబంధించీ వస్తున్న ఏ వార్తలను నమ్మొద్దు అని అన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ను మనాలిలో ప్రారంభించనున్నాము. త్వరలో టీజర్ అప్డేట్ను ఇస్తాము అని నిర్మాత పేర్కొన్నారు.
అలాగే, అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని, మిగతా రూమర్స్‌ను పట్టించుకోవద్దు.. అని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఇన్నిరోజులు ఏజెంట్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ అని తేలిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ - సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర (Anil Sunkara), సురేందర్ రెడ్డి (Surender Reddy) కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. దీని కోసం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అఖిల్ పోస్టర్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో మొదలుకాబోతున్న షెడ్యూల్‌తో టాకీపార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం.