Agent టీజర్ హైలైట్స్ ఇవేనట !

Twitter IconWatsapp IconFacebook Icon
Agent టీజర్ హైలైట్స్ ఇవేనట !

అక్కినేని నవయువ కథానాయకుడు అఖిల్ (Akhil).. ఐదవ చిత్రం ‘ఏజెంట్’ (Agent). సురేంద్ర రెడ్డి (Surender reddy) దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేంద్ర 2 సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సీక్రెట్ స్పై గా అఖిల్ చేసే సాహసాలు అభిమానుల్ని ఎంతగానో అలరించబోతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. ఏజెంట్ పాత్రకోసం అఖిల్ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు. సినిమా అనౌన్స్ మెంట్ రోజున విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రివీలైన మరిన్ని అఖిల్ స్టిల్స్.. సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచాయి. ఇక ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకున్న డేట్‌కు రాకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిర్మాతలు మాత్రం దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. 

అతి త్వరలో ‘ఏజెంట్’ చిత్రం టీజర్ రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. దాంతో పాటు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారని టాక్.  తాజాగా ఏజెంట్ టీజర్ కట్ పూర్తయిందని, ఎడిటింగ్ కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. టీజర్ సరిగ్గా 1 నిమిషం 15 సెకన్ల పాటు ఉండబోతున్నట్టు టాక్. టీజర్ లో అఖిల్ మేకోవర్ తో పాటు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్స్ కాబోతున్నాయట. అలాగే రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండేలా టీజర్ కట్ చేశారని, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ టీజర్ లో హైలైట్‌గా నిలుస్తారని టాక్. హిప్ హాప్ తమిళ (Hiphop Tamizha) సంగీతం, రసూల్ (Rasool) ఫోటోగ్రఫీకూడా ఈ టీజర్ కు ఆకర్షణగా నిలుస్తాయట. 

హాలీవుడ్ సూపర్ హిట్ బోర్న్ (Bourne) సిరీస్ ఆధారంగా ‘ఏజెంట్’ చిత్రం తెరకెక్కనున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. దేశరక్షణకు సంబంధించిన రహస్యాల్ని శత్రుదేశపు గూఢచారుల బారిన పడకుండా ఉండేందుకు.. ఇండియన్ ఏజెంట్ ఎలాంటి సాహసానికి ఒడిగట్టాడు? ఆ ప్రయత్నంలో అతడు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. విదేశాల్లో అత్యధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో .. కొందరు విదేశీనటులు కూడా అభినయిస్తున్నారు. అలాగే.. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారట. మరి ఏజెంట్ టీజర్ ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.