Agent : మనాలిలో యాక్షన్ మోడ్‌లో అఖిల్

ABN , First Publish Date - 2022-05-25T17:29:49+05:30 IST

అక్కినేని నవయువ కథానాయకుడు అఖిల్ (Akhil).. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligeble Bachelor) చిత్రంతో తన కెరీర్ లోనే తొలి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్‌తో తదుపరి చిత్రం ‘ఏజెంట్’ (Agent) లో చాలా ఉత్సాహంగా నటిస్తున్నాడు. అందులోని పాత్రకోసం వెరైటీ మేకోవర్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

Agent : మనాలిలో యాక్షన్ మోడ్‌లో అఖిల్

అక్కినేని నవయువ కథానాయకుడు అఖిల్ (Akhil).. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligeble Bachelor) చిత్రంతో తన కెరీర్ లోనే తొలి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్‌తో తదుపరి చిత్రం ‘ఏజెంట్’ (Agent) లో చాలా ఉత్సాహంగా నటిస్తున్నాడు.  అందులోని పాత్రకోసం వెరైటీ మేకోవర్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలోని అతడి గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘సైరా నరసింహారెడ్డి’  తర్వాత  దర్శకుడు సురేంద్ర రెడ్డి (Surender reddy).. తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ఏజెంట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. హాలీవుడ్ సూపర్ హిట్  ‘బార్న్(Bourne) సిరీస్ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం మనాలిలో హై యాక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా తెలియచేస్తూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు.  హీరో అఖిల్ (Akhil), దర్శకుడు సురేంద్ర రెడ్డి (Surender Reddy) తో పాటు ఇతర టెక్నీషియన్స్ ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. 


ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మిస్తున్న ‘ఏజెంట్’ (Agent) చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్‌గా నటిస్తున్నారు. ‘యాత్ర’  తర్వాత ఆయన నటిస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. దేశానికి ముప్పు వాటిల్లే కుట్రలు జరుగుతుండడంతో సీక్రెట్ మిషన్ ను టేకప్ చేస్తాడు కథానాయకుడు. అందులో భాగంగా ఓ రిటైర్డ్ మిలటరీ మేజర్‌తో తలపడాల్సి వస్తుంది. చివరికి తన దేశాన్ని రక్షించుకోడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడు అన్నదే ఈ సినిమా కథాంశం. మిలటరీ మేజర్‌గా మమ్ముట్టి నటిస్తున్నారు. సాక్షివైద్య కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి హిపాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అఖిల్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-05-25T17:29:49+05:30 IST