అప్పుడు మంచు మనోజ్‌తో.. ఇప్పుడు మంచు విష్ణుతో!!

ABN , First Publish Date - 2022-03-08T01:09:40+05:30 IST

మంచు ఫ్యామిలీ హీరో సినిమాలో మరోసారి మెరవబోతోంది భారీ ఫాలోయింగ్ తార సన్నీలియోన్. మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’గా ఓ చిత్రంలో నటించబోతోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా

అప్పుడు మంచు మనోజ్‌తో.. ఇప్పుడు మంచు విష్ణుతో!!

మంచు ఫ్యామిలీ హీరో సినిమాలో మరోసారి మెరవబోతోంది భారీ ఫాలోయింగ్ తార సన్నీలియోన్. మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’గా ఓ చిత్రంలో నటించబోతోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియన్ కూడా నటించబోతున్నారని తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్, రేణుక పాత్రలో సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఇంతకుముందు ‘గాలి నాగేశ్వరరావు’ పాత్రకి సంబంధించిన కార్టూన్‌లానే వారి గెటప్‌లను కూడా కార్టూన్ రూపంలో విడుదల చేశారు.


సన్నీలియోన్ విషయానికి వస్తే.. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంట్ తీగ’ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. అందులో ఓ ప్రత్యేక గీతంలో సన్నీలియోన్ నర్తించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘పిఎస్వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో’ అంటూ మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె దర్శనమిచ్చారు. ఇప్పుడు మంచు విష్ణు చేయబోతోన్న చిత్రంలో రేణుక పాత్రలో సన్నీలియోన్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర గురించి సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో స్పందిస్తూ.. ‘‘ఈ రోజు మరో జర్నీని మంచు విష్ణుతో కలిసి మొదలుపెడుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వేచి చూస్తూ ఉండండి’’ అని తెలిపారు.   


డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై.. ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కథ, స్ర్కీన్‌ప్లే‌తో పాటు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరించనున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందిస్తున్న ఈ చిత్రానికి చోటా.కె. నాయుడు కెమెరా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు.



Updated Date - 2022-03-08T01:09:40+05:30 IST