RP Patnaik: మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్.. ఈసారి కిల్లర్‌గా!!

ABN , First Publish Date - 2022-09-29T04:11:19+05:30 IST

సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) పేరు అందరికీ సుపరిచితమే. అయితే అంతటితోనే ఆయన ఆగలేదు.. ఆ తర్వాత యాక్టర్‌గా, దర్శకుడిగా తనలోని

RP Patnaik: మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్.. ఈసారి కిల్లర్‌గా!!

సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) పేరు అందరికీ సుపరిచితమే. అయితే అంతటితోనే ఆయన ఆగలేదు.. ఆ తర్వాత యాక్టర్‌గా, దర్శకుడిగా తనలోని మల్టీ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ.. అన్ని విభాగాల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే, 2016లో వచ్చిన ‘మనలో ఒకడు’ (Manalo Okadu) చిత్రం తర్వాత ఆయన మళ్లీ అన్ని విభాగాలకు గ్యాప్ ఇచ్చారు. ఆయన చివరిగా సంగీతం అందించిన చిత్రం, అలాగే దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. ఇందులో హీరో కూడా ఆర్పీనే. ఆ సినిమా వచ్చిన.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన బిజీ అవుతున్నారు. ఈసారి నటుడిగా కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ, అలాగే దర్శకుడిగానూ తన ప్రతిభను మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. 


ఆయన సంగీతం అందించిన చిత్రం ‘అహింస’ (Ahimsa) కు సంబంధించి ఇటీవలే ఓ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ దర్శకుడు. దగ్గుబాటి వారి మరో వారసుడు అభిరామ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇక ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ (Coffee with a Killer). ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో అధికారికంగా విడుదల (Coffee with a Killer Trailer Release) చేశారు. ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. నేటి ట్రెండ్‌కు దగ్గరగా ఉంటూ.. ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. సినిమాపై మంచి క్రేజ్‌కి కారణమవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. 


ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘ఓటిటిలు వచ్చాక ప్రేక్షకులకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. కొత్తగా ఏదైనా పాయింట్ ఉంటేనే కానీ థియేటర్స్‌కు రప్పించలేని పరిస్థితి. అలాంటి ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2022-09-29T04:11:19+05:30 IST