Allu Arjun: ‘మెగాస్టార్’‌ అని మళ్లీ అనకుండా ఇచ్చాడు

ABN , First Publish Date - 2022-10-02T02:05:29+05:30 IST

ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా అయినా హిట్టయితే.. ఆ హీరో ముందు ‘మెగాస్టార్’ (MegaStar) అనే బిరుదు చేర్చుతూ.. ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో..

Allu Arjun: ‘మెగాస్టార్’‌ అని మళ్లీ అనకుండా ఇచ్చాడు

ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా అయినా హిట్టయితే.. ఆ హీరో ముందు ‘మెగాస్టార్’ (MegaStar) అనే బిరుదు చేర్చుతూ.. ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆ హీరో పేరును వైరల్ చేస్తున్నారు. దీనిపై మెగా, ఇతర హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణమే నడుస్తోంది. ఇతర హీరోల అభిమానుల విషయంలో ఇలా ఉంటే.. మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు కూడా.. ఆయన పేరు ముందు మెగాస్టార్ అని చేర్చి.. మెగా వేరు, అల్లు వేరు అనే అభిప్రాయాన్ని స్ట్రాంగ్‌గా కల్పించడానికి ప్రయత్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ‘ఆర్మీ’ (Army) అంటూ పలు సందర్భాలలో ప్రస్తావించడంతో అది నిజమే అనేలా కూడా పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది.  ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo), ‘పుష్ప’ (Pushpa) ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బన్నీ ఫ్యాన్స్ అలా ఊహించుకున్నారో.. లేదంటే కావాలనే ఆ ట్యాగ్ కోరుకున్నారో తెలియదు కానీ.. ‘మెగాస్టార్’ అనే బిరుదు కోసం సోషల్ మీడియాలో గట్టిగానే శ్రమించారు. మెగాస్టార్ అంటే చిరంజీవి (Chiranjeevi)గారే అని బన్నీ కూడా పలు సందర్భాలలో చెప్పాడు. అయినా కూడా కొందరు ఫ్యాన్స్.. రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. అలా రెచ్చగొట్టే వారందరికీ మరోసారి.. తాజాగా జరిగిన ‘అల్లు స్టూడియోస్’ (Allu Studios) లాంచ్‌ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్.


ఈ కార్యక్రమంలో ‘‘ఈరోజు ఇక్కడకు వచ్చి మా ‘అల్లు స్టూడియోస్’ని ప్రారంభించి మాకెంతో గౌరవాన్ని ఇచ్చిన ‘మెగాస్టార్’ చిరంజీవిగారికి నా తరుపున, మా అల్లు కుటుంబం తరపున సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. థ్యాంక్యూ చిట్టి బాబాయ్..’’ అని స్టార్ట్ చేసిన బన్నీ.. ఆ తర్వాత అల్లు స్టూడియోస్ ఆవిష్కరణకు కారణం, పర్పస్ ఏమిటనే దానిపై ప్రసంగించారు. అలాగే తన తండ్రికి.. ఆయన తండ్రిపై ఉన్న ప్రేమని తెలియజేస్తూ.. అంతగా ప్రేమిస్తున్న తన తండ్రికి అభినందనలు తెలిపారు. ఇక చివరిగా.. ‘కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మెగా అభిమానులకు, నన్ను ప్రేమించే నా ఆర్మీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చాడు. బన్నీ ప్రసంగం తర్వాత.. ముఖ్యంగా మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏమనుకుంటున్నారంటే.. ‘‘మెగాస్టార్ అంటే చిరంజీవి.. అంతే. ఆ విషయం బన్నీ మరోసారి క్లారిటీగా చెప్పాడు. మళ్లీ ఎవరూ ‘మెగాస్టార్’ అని మాట్లాడకుండా గట్టిగా ఇచ్చాడు’’ అని అనుకుంటున్నారు. మరి ఇకనైనా.. అల్లు అర్జున్‌కి ముందు ఆ ట్యాగ్ చేర్చి రచ్చ చేసే వారు మానుకుంటారో.. లేదంటే మళ్లీ మళ్లీ రెచ్చగొడుతూనే ఉంటారో చూద్దాం. 



Updated Date - 2022-10-02T02:05:29+05:30 IST