పెళ్లయిన మూడు రోజులకే బిజీగా మారిన ranbir kapoor

ABN , First Publish Date - 2022-04-18T00:18:08+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వివాహం ఏప్రిల్ 14న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు.

పెళ్లయిన మూడు రోజులకే బిజీగా మారిన ranbir kapoor

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వివాహం ఏప్రిల్ 14న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. కరణ్  జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయి ఈ వేడుకలో సందడి చేశారు. ఆలియా ఏప్రిల్ 16న మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వేడుక అంతా ఓ కలలా జరిగిందని తెలిపింది. పెళ్లయిన 3 రోజులకే కొత్త పెళ్లి కొడుకు రణ్‌బీర్ కపూర్ బిజీ అయిపోయాడు.


సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ముంబైలోని టీ సిరీస్ కార్యాలయాన్ని సందర్శించాడు. ఆఫీస్ బయట ఫొటోలకు ఫోజులిచ్చాడు. రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ సినిమాను టీ సిరీసే నిర్మిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి చర్చించడానికే టీ సిరీస్ కార్యాలయానికి రణ్‌బీర్ కపూర్ విచ్చేసినట్టు తెలుస్తోంది. ‘యానిమల్’ షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాలి. కానీ, రణ్‌బీర్ పెళ్లి పనుల కారణంగా చిత్రీకరణను ప్రారంభించలేదు. ప్రస్తుతం కార్యక్రమాలు అయిపోయాయి కాబట్టి త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. గీతాంజలి అనే పాత్రలో ఆమె కనిపించబోతుంది.



Updated Date - 2022-04-18T00:18:08+05:30 IST