ARYAN KHAN ని అతడే kidnap చేశాడంటోన్న మంత్రి

ABN , First Publish Date - 2021-11-21T16:15:44+05:30 IST

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కాంట్రవర్సీ ఇంకా చల్లబడటం లేదు. జూనియర్ ఖాన్‌ని ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 2న అనూహ్యంగా అరెస్ట్ చేయటంతో అందరూ షాక్ అయ్యారు. బాలీవుడ్ జనాలైతే మరింత విభ్రాంతికి గురయ్యారు.

ARYAN KHAN ని అతడే kidnap చేశాడంటోన్న మంత్రి

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కాంట్రవర్సీ ఇంకా చల్లబడటం లేదు. జూనియర్ ఖాన్‌ని ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 2న అనూహ్యంగా అరెస్ట్ చేయటంతో అందరూ షాక్ అయ్యారు. బాలీవుడ్ జనాలైతే మరింత విభ్రాంతికి గురయ్యారు. కాకపోతే, ఆర్యన్ డ్రగ్స్ కేసు మొదలైనప్పటి నుంచీ కింగ్ ఖాన్‌కి పూర్తి మద్దతు పలుకుతున్నాడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. అదే సమయంలో, ఎన్సీబీ ఆఫీసర్ సమీర్ వాంఖడేను కూడా ఆయన టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా మరోసారి నవాబ్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశాడు. సమీర్ వాంఖడే ఆర్యన్‌ను అరెస్ట్ కాదు కిడ్నాప్ చేశాడంటూ ట్వీట్ చేశాడు...

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత హై కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా పూర్తి బెయిల్ ఆర్డర్‌ను న్యాయస్థానం విడుదల చేసింది. అందులో ఆర్యన్ ఖాన్, అర్భాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచా ‘కుట్ర’ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కామెంటే ఇప్పుడు చాలా మంది రియాక్షన్‌కు కారణం అవుతోంది. ముఖ్యంగా, మహారాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి అయిన నవాబ్ మాలిక్ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను తీవ్రంగా తప్పుబడుతున్నాడు. కోర్టు ఆధారాలు ఏమీ లేవని చెబుతోంది అంటే... అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆర్యన్‌ని అక్రమంగా అరెస్ట్ చేసినట్టే అంటున్నారు మినస్టర్. వాంఖడే కుట్ర చేసి ఆర్యన్‌ని కేసులో ఇరికించాడని ఆయన ట్వీట్ చేశాడు. నిజానికి షారుఖ్ తనయుడ్ని సమీర్ వాంఖడే కిడ్నాప్ చేసి, బెదిరించి, డబ్బులు వసూలు చేద్దామని భావించాడనీ... కానీ, ఒక్క సెల్ఫీ లీక్ అవ్వటంతో ప్లాన్ వర్కవుట్ కాలేదని ఆయన చెబుతున్నాడు!

ఇంతకు ముందు కూడా సమీర్ వాంఖడేని నవాబ్ మాలిక్ టార్గెట్ చేశాడు. ఆయన ముస్లిమ్ అంటూ వాంఖడే కుటుంబ చరిత్రని తొవ్వి తీశాడు. ఇప్పుడు ఆర్యన్‌ని కిడ్నాప్ చేసి షారుఖ్‌ని బెదిరించాలని ప్రయత్నించాడంటూ మరింత తీవ్రంగా దాడి చేస్తున్నాడు. చూడాలి మరి, మినిస్టర్ ఆరోపణలపై ఎన్సీబీ ఆఫీసర్ వాంఖడే ఏ విధంగా స్సందిస్తారో! ఆయన ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ని ఎలా సమర్థించుకుంటాడో!

Updated Date - 2021-11-21T16:15:44+05:30 IST