Shankar: రామ్ చరణ్, కమల్ తర్వాత శంకర్ హీరో ఎవరంటే..?

ABN , First Publish Date - 2022-09-22T00:43:14+05:30 IST

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్ (Shankar). విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధానమిచ్చి భారీ స్థాయిలో సినిమాలను రూపొందిస్తుంటారు. ‘జెంటిల్ మేన్’, ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, రోబో

Shankar: రామ్ చరణ్, కమల్ తర్వాత శంకర్ హీరో ఎవరంటే..?

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్ (Shankar). విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధానమిచ్చి భారీ స్థాయిలో సినిమాలను రూపొందిస్తుంటారు. ‘జెంటిల్ మేన్’, ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, రోబో వంటి చిత్రాలతో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువయ్యాడు. ప్రస్తుతం శంకర్ ఒకేసారి రెండు ప్రాజెక్టులకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఆర్‌సీ-15’ ను ఇప్పటికే 75శాతం పూర్తి చేశాడు. ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే కమల్ హాసన్ (Kamal Haasan) తో ‘ఇండియన్-2’ (Indian-2) ను పట్టాలెక్కించాడు. ఈ ప్రాజెక్టుల తర్వాత శంకర్ సినిమా ఇప్పటికే ఫిక్సయినట్టు తెలుస్తోంది. అందుకోసం ఓ స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. 


శంకర్ ‘వెల్పరి’ (Velpari) నవలను సినిమాగా రూపొందించాలనుకుంటున్నాడట. ఈ నవలను సూర్య‌తో రూపొందించాలనుకుంటున్నాడని వదంతులు హల్‌‌చల్ చేస్తున్నాయి. అందుకోసం ఇద్దరు కలసి ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారని సమాచారం. భారీ స్థాయిలో గతంలో ఎవరు తెరకెక్కించని విధంగా ఈ సినిమా రూపొందించాలనే ఆలోచనలో సూర్య, శంకర్ ఉన్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రాజెక్టు పనులు మొదలు కాబోతున్నట్టు సమాచారం. వెల్పరి నవల హక్కులు సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ వద్ద ఉన్నాయి. సూర్య ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ ప్రాజెక్టును పాన్ ఇండియగా పలు భాషల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వెల్పరి నవలను సు వెంకటేశన్ రాశారు. ఈ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ నవల కోసం వెంకటేశన్ దాదాపు ఆరు ఏళ్ల పాటు పరిశోధన చేశారు. అనేక ప్రాంతాలకు ప్రయాణించారు. ఈ నవల తమిళ్ వీక్లీలో ‘ఆనంద్ వికటన్’ (Anand Vikatan)లో సీరియల్‌గా ప్రచురితమైంది. దాదాపుగా 100వారాల పాటు నడిచింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను ఆధారంగా సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘పీఎస్-1’, ‘పీఎస్-2’ పేర్లతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ‘పీఎస్-1’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల కానుంది.   




Updated Date - 2022-09-22T00:43:14+05:30 IST