Liger: ఇప్పుడు జాన్వీకపూర్ ముఖచిత్రం ఏంటో?

ABN , First Publish Date - 2022-08-28T03:01:05+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం (వాళ్లు మొదటి నుండి అలాగే చెప్పుకొచ్చారులే) ‘లైగర్’ (Liger). సాలా క్రాస్‌బీడ్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా..

Liger: ఇప్పుడు జాన్వీకపూర్ ముఖచిత్రం ఏంటో?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం (వాళ్లు మొదటి నుండి అలాగే చెప్పుకొచ్చారులే) ‘లైగర్’ (Liger). సాలా క్రాస్‌బీడ్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై మొదటి షో కే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా.. మొదటి రోజు కలెక్లన్లు బాగున్నప్పటికీ.. రెండో రోజు పరిస్థితి కాస్త దారుణంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గట్టెక్కాలంటే చాలా కష్టమే అనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా విషయంలో ఇప్పుడు అతిలోకసుందరి తనయ ముఖచిత్రం ఏమై ఉంటుందా? అని ఇప్పుడంతా చర్చలు జరుపుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. 


ఎందుకంటే.. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా జాన్వీకపూర్‌ (Jhanvi Kapoor)ని సంప్రదించామని.. మొదటి నుంచి టీమ్ చెప్పుకొస్తుంది. అలాగే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా దర్శకుడు పూరీ చెప్పుకొచ్చారు. ‘‘ముందుగా జాన్వీని ఈ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా ట్రై చేశాను.. కానీ ఆమె ఆ సమయంలో బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది. దీంతో ఈ సినిమాకి జాన్వీ పనిచేయలేకపోయింది. ఆ తర్వాత కరణ్ చెప్పడంతో అనన్యపాండేని సీన్‌లోకి తీసుకొచ్చాం’’ అని పూరీ ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఈ సినిమా చూసిన వారంతా.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే అనన్యపాండే (Ananya Pandey)ని, ఆమె పాత్రని బాగా విమర్శిస్తున్నారు. ఈ సినిమాకున్న మైనస్‌లలో ప్రధాన కారణంగా ఆమెను కూడా చెబుతున్నారు. 


ఈ టాక్‌తోనే ఇప్పుడు జాన్వీకపూర్ వార్తలలోకి వచ్చింది. ముందు అనుకున్నట్లుగా ఆమె కనుక ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉంటే.. తొలి చిత్రంతోనే పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చేది. ఈ సినిమా కాదనుకుని చాలా మంచి పనిచేసింది. ప్రస్తుతం ఈ సినిమా రిజల్ట్ తెలిశాక.. ఆమె ఈ చిత్రంలో చేయకుండా ఉండటమే మంచిదైందని అనుకుంటూ ఉంటుందని.. ఇప్పుడామె ముఖచిత్రాన్ని ఒక్కసారి చూడాలని ఉందంటూ.. ఆమె అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. విజయ్‌తో డేటింగ్‌కి సిద్ధమని చెప్పిన జాన్వీ.. ఆయన సినిమాలో నటించలేదంటే.. ఈ ఫలితం ఆమె ముందే ఊహించి ఉంటుందని కూడా కొందరు మాట్లాడుకుంటుండటం విశేషం. 

Updated Date - 2022-08-28T03:01:05+05:30 IST