విడాకుల తర్వాత, ఆధ్యాత్మిక యాత్రలో Samantha తో పాటు ఉన్న Shilpa Reddy బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-10-23T22:17:21+05:30 IST

నాగ చైతన్య నుంచీ విడిపోయాక సమంత కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకునే పనిలో ఉంది. ఆ క్రమంలో ఆమె నూతనోత్సాహంతో సినిమాలు చేయబోతోంది. అయితే, అంతకంటే ముందు... గ్లామర్ ప్రపంచం తళుకుబెళుకుల్లో నేరుగా మునగకుండా... ముందుగా ఆధ్యాత్మిక యాత్ర మొదలు పెట్టింది. అయితే, సమంతతో పాటూ పుణ్యక్షేత్రాలు సందర్శించిన ఆమె స్నేహితురాలిపై ఇప్పుడు నెటిజన్స్ దృష్టి పడింది! ఇంతకీ, శిల్పా రెడ్డి ఎవరు?

విడాకుల తర్వాత, ఆధ్యాత్మిక యాత్రలో Samantha తో పాటు ఉన్న Shilpa Reddy బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

నాగ చైతన్య నుంచీ విడిపోయాక సమంత కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకునే పనిలో ఉంది. ఆ క్రమంలో ఆమె నూతనోత్సాహంతో సినిమాలు చేయబోతోంది. అయితే, అంతకంటే ముందు... గ్లామర్ ప్రపంచం తళుకుబెళుకుల్లో నేరుగా మునగకుండా... ముందుగా ఆధ్యాత్మిక యాత్ర మొదలు పెట్టింది. అయితే, సమంతతో పాటూ పుణ్యక్షేత్రాలు సందర్శించిన ఆమె స్నేహితురాలిపై ఇప్పుడు నెటిజన్స్ దృష్టి పడింది! ఇంతకీ, శిల్పా రెడ్డి ఎవరు? 


శిల్పా రెడ్డి సామాన్యులకి అంతగా తెలియకపోవచ్చుగానీ... టాలీవుడ్ సెలబ్రిటీలకు బాగానే పరిచయం. హైద్రాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె ఫ్యాషన్ డిజైనర్. మోడల్ అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోయిన్స్‌కి ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. తన క్రియేటివ్ అండ్ ట్రెడిషనల్ స్టైలిష్ ఐడియాస్ గ్లామర్ ప్రపంచంలో సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు! 


టాలీవుడ్‌లోని మోస్ట్ ఫ్యాషనబుల్ హీరోయిన్స్‌లో ఒకరైన సమంతకి... వృత్తి రిత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన శిల్పా రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ అవ్వటం ఆశ్చర్యం ఏముంది చెప్పండి? గతంలోనూ చాలా సార్లు కలసి కనిపించారు స్యామ్ అండ్ శిల్పా. తాజాగా ఈ ఇద్దరు ఉత్తరాదిన పుణ్యక్షేత్ర సందర్శనకి బయలుదేరారు. సమంత, శిల్పా స్పెషల్ వెకేషన్ ఫోటోస్ సొషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 


శిల్పా రెడ్డి సోదరుడు సమ్రాట్ రెడ్డి కూడా టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన ‘వైఫ్ ఆప్ రామ్, అహా నా పెళ్లంట, పంచాక్షరి’ వంటి పలు చిత్రాల్లో నటించాడు.  

Updated Date - 2021-10-23T22:17:21+05:30 IST