Ram Gopal Varma : Shahrukh కొడుకు Aryan Khan కే అలా జరిగితే... మామూలు వాళ్ల గతేంటి?

ABN , First Publish Date - 2021-11-22T19:08:06+05:30 IST

షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో మరోసారి స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా బాంబే హైకోర్టు ఆర్యన్ కుట్ర చేశాడనే కోణంలో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాంతో చాలా మంది ప్రముఖులు ‘ఆర్యన్‌ని ఉద్దేశ్యపూర్వకంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టా’రని కామెంట్స్ చేస్తున్నారు. వారితో వర్మ కూడా జత కలిశాడు...

Ram Gopal Varma : Shahrukh కొడుకు  Aryan Khan కే అలా జరిగితే... మామూలు వాళ్ల గతేంటి?

షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో మరోసారి స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా బాంబే హైకోర్టు ఆర్యన్ కుట్ర చేశాడనే కోణంలో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దాంతో చాలా మంది ప్రముఖులు ‘ఆర్యన్‌ని ఉద్దేశ్యపూర్వకంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టా’రని కామెంట్స్ చేస్తున్నారు. వారితో వర్మ కూడా జత కలిశాడు. ఆయన సొషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.


‘‘తమకున్న అధికారాల్ని దుర్వినియోగం చేసే దర్యాప్తు సంస్థలకి ఎటువంటి జవాబుదారితనం లేకపోతే... అది ప్రజాస్వామ్యంలో జోక్ లాగా మారిపోతుంది’’ అంటూ ఎన్సీబీని టార్గెట్ చేసిన రాము ‘‘షారుఖ్ ఖాన్ కొడుక్కే ఇటువంటిది జరిగినప్పుడు తక్కువ స్థాయిలోని సామాన్యుల గతేంటో దేవుడికే తెలియాలి!’’ అంటూ వాపోయాడు. రామ్ గోపాల్ వర్మలాగే బీ-టౌన్‌లోని చాలా మంది, ఇప్పుడు, ఆర్యన్ ఖాన్ అమాయకుడు అంటున్నారు. మరికొందరు మాత్రం ‘సరైన సాక్ష్యాలు, ఆధారాలు’ లేనంత మాత్రాన అతడు నిర్దోషి అయిపోడని వాదిస్తున్నారు. కోర్టులో కేసు ముగిసి తీర్పు వస్తేనే క్లీన్ చీట్ లభించినట్లు అని వారంటున్నారు.  

Updated Date - 2021-11-22T19:08:06+05:30 IST