18 ఏళ్ల కింద... 11 ఏళ్ల Alia, 20 ఏళ్ల Ranbir... ఓ రొమాంటిక్ ఫోటో!

ABN , First Publish Date - 2022-04-25T01:41:34+05:30 IST

ఆలియా, రణబీర్ పెళ్లి ఎట్టకేలకు జరిగిపోయింది. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తోన్న క్రేజీ వెడ్డింగ్ ఘనంగా ముగిసింది. అయితే, స్టార్ కపుల్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా బీ-టౌన్ తాజా భార్యభర్తల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆలియా, రణబీర్ మ్యారేజ్ హ్యాంగోవర్‌లో ఉన్న నెటిజన్స్‌కు లెటెస్ట్‌గా బయటపడ్డ 18 ఇయర్స్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఎక్కడలేని కి్క్‌నిచ్చింది!

18 ఏళ్ల కింద... 11 ఏళ్ల Alia, 20 ఏళ్ల Ranbir... ఓ రొమాంటిక్ ఫోటో!

ఆలియా, రణబీర్ పెళ్లి ఎట్టకేలకు జరిగిపోయింది. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తోన్న క్రేజీ వెడ్డింగ్ ఘనంగా ముగిసింది. అయితే, స్టార్ కపుల్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా బీ-టౌన్ తాజా భార్యభర్తల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆలియా, రణబీర్ మ్యారేజ్ హ్యాంగోవర్‌లో ఉన్న నెటిజన్స్‌కు లెటెస్ట్‌గా బయటపడ్డ 18 ఇయర్స్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఎక్కడలేని కి్క్‌నిచ్చింది!


ఆలియా, రణబీర్ మొదటిసారి కలసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అయితే, ‘బ్రహ్మాస్త్ర’ కంటే ముందే వారు ఓ సినిమాలో జంటగా నటించాల్సి ఉండింది! పైగా అప్పటికి మన లిటిల్ గాళ్ ఆలియా వయస్సు కేవలం 11 ఏళ్లే! అయినా కూడా 18 ఏళ్ల కిందట తన కాబోయే భర్త రణబీర్‌తో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ రొమాంటిక్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఎలా అంటారా? అంతా ‘గంగూబాయ్’ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కారణంగా... 


సంజయ్ కొన్ని సంవత్సరాల కిందట ‘బాలికా వధూ’ అనే సినిమా రూపొందించాలనుకున్నాడు. అది బాల్య వివాహాల గురించిన చిత్రం. అందులో హీరోయిన్ టైటిల్‌కి తగ్గట్టుగానే ‘చిన్నారి పెళ్లికూతురు’. మరి దానికి ఎవరు సూటవుతారు? అప్పటికి 11 ఏళ్ల వయస్సున్న ఆలియా కరెక్టేమోనని బాన్సాలీ భావించాడు. అందుకే, తనని పిలిపించి ఫోటోషూట్ నిర్వహించాడు. ఎవరితో అంటారా? 2022లో... 18 ఏళ్ల అనంతరం... ఆలియా మెడలో మూడు ముళ్లు వేయనున్న రణబీర్‌తో! అప్పటికి కపూర్ వయస్సు 20 సంవత్సరాలు...


20 ఏళ్ల రణబీర్ భుజంపై తలను వాల్చిన 11 ఏళ్ల ఆలియా భట్ బ్లాక్ అండ్ వైట్ పిక్ ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. క్లారిటీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు బాన్సాలీ ఫోటోషూట్‌లోని చిత్రాన్ని. ఇంతకీ, ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందంటే... ఆలియా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్‌గా ఓ వీడియో షేర్ చేసింది. ‘గంగూబాయ్’ పాత్ర కోసం తాను ముప్పై రోజుల పాటూ చేసిన ప్రిపరేషన్స్ అందులో చూపించింది. ఆ క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న ఓ ఫోటో ఫ్రేమ్‌పై వీక్షకుల దృష్టి పడింది. అది 18 ఏళ్ల కిందటి ‘బాలికా వధూ’ సినిమా స్క్రీన్ టెస్ట్‌కు సంబంధించినదేనని చెబుతూ వైరల్ చేయటం మొదలు పెట్టారు. వీడియోలోంచి ఫోటోని చకచకా స్క్రీన్ షాట్ తీసేశారు. 


ఆలియా, రణబీర్ తమ అలనాటి బ్లాక్ అండ్ వైట్ రొమాంటిక్ పిక్‌ని ఇంత వరకూ ఖండించలేదు. నెటిజన్స్ మాట్లాడుకుంటోన్నది నిజమేనన్నట్టు మౌనంగా ఉండిపోయారు. కానీ, ఆలియా యూట్యూబ్ ఛానల్లోంచీ సదరు వీడియోని మాత్రం సైలెంట్‌గా తొలగించేశారు! అప్పటికే సొషల్ మీడియా యూజర్స్ స్క్రీన్ షాట్ తీయటంతో అంతర్జాలం అంతటా ఆలియా, రణబీర్ చిన్ననాటి ఫోటోనే చక్కర్లు కొడుతోంది! 

Updated Date - 2022-04-25T01:41:34+05:30 IST