1997 నుంచీ ఒక్కసారి కూడా ఏడవని నటి!

ABN , First Publish Date - 2022-02-16T01:02:17+05:30 IST

అమెరికన్ ఫేమస్ ర్యాపర్ కాన్యే వెస్ట్ మాజీ ప్రేయసి, హాలీవుడ్ బ్యూటీ జూలియా ఫాక్స్. ఆమె ఎయిర్‌పోర్ట్ నుంచీ ‘‘కళ్ల వెంట నీళ్లు కారుతుండగా’’ వేగంగా బయటకు వెళ్లిపోయిందని వార్తలొచ్చాయి. వాటిని ఖండించిన జూలియా...

1997 నుంచీ ఒక్కసారి కూడా ఏడవని నటి!

అమెరికన్ ఫేమస్ ర్యాపర్ కాన్యే వెస్ట్ మాజీ ప్రేయసి, హాలీవుడ్ బ్యూటీ జూలియా ఫాక్స్. ఆమె ఎయిర్‌పోర్ట్ నుంచీ ‘‘కళ్ల వెంట నీళ్లు కారుతుండగా’’ వేగంగా బయటకు వెళ్లిపోయిందని వార్తలొచ్చాయి. వాటిని ఖండించిన జూలియా ‘‘నేను 1997 నుంచీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏడవలేదు. మరీ ముఖ్యంగా, ‘ఇటువంటి’ విషయాలపై అస్సలు కంట తడి పెట్టుకోను...’’ అంది. కాన్యేతో బ్రేకప్ తరువాత తాను ఏమాత్రం కృంగిపోలేదని తేల్చి చెప్పిన ఆమె ‘‘ఆ రోజు నేను ఎక్కాల్సిన విమానానికి ఆలస్యమైపోయింది. అందులో ప్రయాణించి నేను ‘నాకు ఎంతో ముఖ్యమైన’ ఇద్దరు ‘పురుషుల్ని’ కలుసుకోవాల్సింది. వారిద్దరూ... నా తండ్రి, నా కొడుకు!’’ అంటూ వివరించింది జూలియా ఫాక్స్. 


యూఎస్‌లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న కాన్యే వెస్ట్ కొన్నాళ్ల క్రితం భార్య కిమ్ కర్దాషియన్‌కు విడాకులిచ్చాడు. తరువాత జూలియాతో రిలేషన్ కొనసాగుతోందని ప్రచారం జరిగింది. కానీ, కాన్యే దానిపై స్పష్టంగా స్పందించలేదు. ఇంతలోనే వెస్ట్, జూలియా బ్రేకప్ చేసుకున్నారని కూడా టాక్ వినిపించింది. తాము విడిపోయారో లేదో తేల్చి చెప్పని జూలియా ఫాక్స్ ‘ఏడవటం’ మాత్రం అబద్ధం అంటోంది. 1997 తరువాత ఒక్కసారి కూడా కన్నీరు పెట్టుకోలేదని సూటిగా ప్రకటించేసింది!  

Updated Date - 2022-02-16T01:02:17+05:30 IST