First multiplex in Srinagar: 30 ఏళ్ల నిరీక్షణకి తెర.. కశ్మీర్‌లో మొదటి మల్టీప్లెక్స్

ABN , First Publish Date - 2022-09-20T21:21:44+05:30 IST

మూడు దశాబ్దాలకు పైగా సాగిన కశ్మీరీల నిరీక్షణకి మంగళవారం (సెప్టెంబర్ 20)తో తెరపడింది. శ్రీనగర్‌లో మొదటి మల్టీప్లెక్స్‌ని ఐనాక్స్ (INOX) ప్రారంభించింది..

First multiplex in Srinagar: 30 ఏళ్ల నిరీక్షణకి తెర.. కశ్మీర్‌లో మొదటి మల్టీప్లెక్స్

మూడు దశాబ్దాలకు పైగా సాగిన కశ్మీరీల నిరీక్షణకి మంగళవారం (సెప్టెంబర్ 20)తో తెరపడింది. శ్రీనగర్‌లో మొదటి మల్టీప్లెక్స్‌ని ఐనాక్స్ (INOX) ప్రారంభించింది. ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవాన్ని కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) చేతుల మీదుగా నిర్వహించారు. కశ్మీర్ (Kashmir) కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత మొదటి మల్టీప్లెక్స్‌ ఇదే కావడం విశేషం.


ముప్పై ఏళ్ల క్రితం ఉగ్రవాద ముప్పు కారణంగా అప్పటివరకూ ఉన్న సినిమా హాళ్లని మూసి వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క థియేటర్ కూడా ప్రారంభం కాలేదు. అందుకే ఇప్పటి వరకు కశ్మీరీలకు వెండితెర మీద సినిమాలు చూసే అవకాశం కలగలేదు. ఈ మల్టీప్లెక్స్‌లో మూడు పెద్ద ఆడిటోరియాలు ఉండగా.. ఒకేసారి 500 మందికి పైగా సీటింగ్ కెపాసిటీ ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా డోల్బీ అట్మాస్ (Dolby Atmos) డిజిటల్ సౌండ్ సిస్టమ్‌తో సినీ లవర్స్‌కి మంచి అనుభూతిని కలిగిస్తాయని టాక్. కశ్మీరీ హస్తకళలు ‘ఖాతంబంద్’, ‘పేపియర్ మాచే’ ఆధారంగా సినిమా హాళ్లను నిర్మాణం చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-09-20T21:21:44+05:30 IST