నాలుగు దశాబ్దాల తర్వాత సొంత భాషలో సినిమా.. ‘లింగం మామా’ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-03-02T18:55:30+05:30 IST

బాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. గుజరాతీ కుంటుంబానికి చెందిన ఈ నటుడు ముంబైలోనే..

నాలుగు దశాబ్దాల తర్వాత సొంత భాషలో సినిమా.. ‘లింగం మామా’ రియాక్షన్ ఇదే..

బాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. గుజరాతీ కుంటుంబానికి చెందిన ఈ నటుడు ముంబైలోనే పుట్టి పెరిగాడు. అనంతరం ఈ సినీయర్ నటుడు 1982లో గుజరాతీ సినిమా ‘నసీబ్ నీ బలీహరీ’తో సినీ పరిశ్రమకి పరిచయమైయ్యాడు. తర్వాత హిందీ సినిమాల్లోకి ప్రవేశించి అక్కడ మంచి గుర్తింపు సాధించాడు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘శంకర్‌దాదా’లో లింగం మామగా నటించడమే కాకుండా ఇతర భాష చిత్రాల్లో కూడా యాక్ట్ చేసి మంచి పాపులారిటీ సంపాదించాడు.


అయితే..  పరేష్ తన మొదటి సినిమా అనంతరం ఇంతవరకు మరే గుజరాతీ మూవీ నటించలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ నటుడు తాజాగా మరో గుజరాతీ సినిమా ‘డియర్ ఫాదర్’లో నటించనున్నాడు. రచయిత సత్య జీత్ రే నవల ‘డియర్ ఫాదర్’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.


ఓ ఇంటర్య్వూలో గుజరాతీ సినిమా గురించి పరేష్ మాట్లాడుతూ.. ‘అప్పటికి ఇప్పటికి గుజరాతీ సినిమాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆధునిక భావాలకు అనుగుణంగా చిత్రనిర్మాణం మారింది. వారు వాటిని అర్బన్ గుజరాతీ చిత్రాలు అని పిలుస్తారు. అయితే నాకు అర్బనా లేక రూరలా అనేది అవసరం లేదు. సినిమా మంచిదా కాదా, అది మాత్రమే ఆలోచిస్తాను. అక్కడ అభిషేక్ షా లాంటి యంగ్ టాలెంట్ బయటికి వస్తుంది. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ‘హెల్లారో’ లాంటి సినిమాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.


పరేష్ ఇంకా మాట్లాడుతూ.. ‘గుజరాతీ ప్రేక్షకులు డిఫరెంట్ కథాచిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అయితే అక్కడ థియేటర్ల కొరత అనే సమస్య ఇబ్బంది పెడుతోంది. మంచి థియేటర్స్, మంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటే పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందుతుంది. నేను సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ 1972 నుంచి గుజరాతీ నాటకాల్లో చేస్తూ వస్తున్నాను. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా అది కుదరడం లేదు. చాలా ఏళ్లుగా మళ్లీ గుజరాతీ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. ఈ మూవీతో అది తీరుతోంది’ అని పేర్కొన్నాడు.


కొత్త సినిమా గురించి పరేష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే నాటకంగా ఉన్న ఈ కథని సినిమాకి తగ్గట్టు మార్చడం కొంచెం సవాలే. అది కనుక సరిగ్గా చేయగలిగితే మంచి విజయాన్ని అందుకుంటుంది. అలా చేయగల టాలెంట్ దర్శకుడు ఉమంగ్ వ్యాస్‌కి ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత గుజరాతీలో నేను నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిలింగ్‌కి గురి చేస్తుంది’ అని తెలిపాడు.

Updated Date - 2022-03-02T18:55:30+05:30 IST