మొన్న హీరో ధనుష్.. నేడు దర్శకుడు బాల.. కోలీవుడ్‌లో విడాకుల కలకలం

ABN , First Publish Date - 2022-03-08T23:30:47+05:30 IST

తమిళ దర్శకుడు బాల తన భార్య ముతుమలర్ నుంచీ విడాకులు తీసుకున్నారు. మార్చ్ 5వ తేదీన ఓ స్థానిక ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే, వారిద్దరూ గత నాలుగేళ్లుగా...

మొన్న హీరో ధనుష్.. నేడు దర్శకుడు బాల.. కోలీవుడ్‌లో విడాకుల కలకలం

తమిళ దర్శకుడు బాల తన భార్య ముతుమలర్ నుంచీ విడాకులు తీసుకున్నారు. మార్చ్ 5వ తేదీన ఓ స్థానిక ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే, వారిద్దరూ గత నాలుగేళ్లుగా విడిగానే ఉంటున్నారు. పరస్పర అంగీకారంతో కోర్టులో డైవోర్స్ కోసం అప్లై చేశారు. బాల, మలర్‌కు ప్రార్థన అనే కూతురు ఉంది. 


వృత్తి పరంగా త్వరలో హీరో సూర్యతో సినిమాని తెరకెక్కించేందుకు డైరెక్టర్ బాల సిద్ధమవుతున్నారు. కానీ, గత కొన్నేళ్లుగా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులకు లోనైంది. భార్యతో విభేదాల కారణంగా విడిపోవటం, విడాకులు తీసుకోవటం వంటివి జరిగాయి. 


దర్శకుడు బాల వివాహం మలర్‌తో 2004, జూలై 5న జరిగింది. కానీ, 18 ఏళ్ల వారి వైవాహిక జీవితం గత మార్చ్ 5న విడాకులతో ముగిసింది. ఇందుకు ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే అంటున్నారు కోలీవుడ్ జనం. బాల, మలర్ నాలుగేళ్లుగా ఒకరికొకరు దూరంగానే ఉంటుండగా తాజాగా కోర్టు మంజూర్ చేసిన విడాకులతో వారి రిలేషన్‌షిప్‌కి ఎండ్ కార్డ్ పడినట్టైంది. కొద్ది రోజుల క్రితమే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోగా ఇప్పుడు బాల, మలర్ డైవోర్స్ చెన్నై సినీ సర్కిల్స్‌లో చాలా మందిని షాక్‌కు గురి చేసింది... 

Updated Date - 2022-03-08T23:30:47+05:30 IST