Majorతో పెద్ద మూమెంట్ తీసుకురాబోతున్నాం: అడివి శేష్

ABN , First Publish Date - 2022-06-05T02:54:48+05:30 IST

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో.. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్..

Majorతో పెద్ద మూమెంట్ తీసుకురాబోతున్నాం: అడివి శేష్

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో.. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇండియా లవ్స్ మేజర్’ (India Loves Major) పేరుతో చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘సినీ ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పోయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి కంటిన్యూ కాల్స్‌తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపోయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది. ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ‘మేజర్’ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం ‘ఎవరు’(Evaru) కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. నేను మేజర్‌ సినిమాని.. ఒక సినిమాగా చూడటం లేదు అది ఒక ఎమోషన్ అంతే. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్‌లో చెబుతున్నా. చిత్రయూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్‌ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి (Abburi Ravi)గారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్‌ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖా(Rekha)కి స్పెషల్ థ్యాంక్స్.


మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏ‌లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్‌కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-05T02:54:48+05:30 IST