సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్‌పై స్పందించిన Adivi Sesh

ABN , First Publish Date - 2022-07-03T22:22:46+05:30 IST

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన ఆ పరంపర ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన

సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్‌పై స్పందించిన Adivi Sesh

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన ఆ పరంపర ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన ‘కెజియఫ్’(KGF), ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) బీ టౌన్‌లో భారీ కలెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా అడివి శేష్ (Adivi Sesh)కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. 


సల్మాన్ ఖాన్ నటించిన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ (Hum Aapke Hain Koun)ను తెలుగులో చూశానని అడివి శేష్ చెప్పాడు. ఈ సినిమా ‘ప్రేమాలయం’ టైటిల్‌తో తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిందన్నాడు.‘‘ప్రేక్షకులు సినిమాలను చూడటం, చూడకపోవడం అనేది ఎప్పటి నుంచే ఉంది. అన్ని ఇండస్ట్రీలు కలసి పనిచేయాలి. ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రతిభ ఉన్నవారని ఆహ్వానించాలి. భాష విషయంలో దక్షిణాది పరిశ్రమకు కొంచెం లాభం ఉంది. సౌత్ ఇండస్ట్రీ మేకర్స్‌కు హిందీ తెలుసు. కానీ, హిందీ ఫిల్మ్ మేకర్స్‌కు ప్రాంతీయ భాషలు తెలియవు. ఈ విషయంలో సౌత్‌దే పై చేయి. ప్రస్తుతం మనం ఇండియన్ ఇండస్ట్రీగా మారుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. సౌత్ నుంచి వచ్చిన వారే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా మారుతారనే అభిప్రాయం ఉంది. శ్రీ దేవి, జయప్రద, రేఖ, దీపికా పదుకొణె వంటి వారు దక్షిణాదికి చెందినవారు కావడంతో ఈ అభిప్రాయం మరింత బలపడింది. కానీ, దక్షిణాది నుంచి వచ్చినవారు బాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన దాఖలాలు లేవు.  ప్రస్తుతం ఆ హద్దులు చెరిగిపోతున్నాయి’’ అని అడివి శేష్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అడివి శేష్ (Adivi sesh) చివరగా ‘మేజర్’ (Major)లో కనిపించాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. 

Updated Date - 2022-07-03T22:22:46+05:30 IST